Charu Sinha: పటిష్టమైన చట్టాలు, కఠిన శిక్షలు అమలవుతున్నప్పటికీ మహిళలు, బాలలపై నేరాలు పెరుగుతుండటం ఆందోళనకరమని సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా అన్నారు. మహిళలను కేవలం విలాస వస్తువుగా చూసే దృక్పథం మారాలని, ముఖ్యంగా యువతలో మహిళలను సమానత్వంతో చూడాలన్న అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దీని కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ, చిల్డ్రన్ ప్రొటెక్షన్ వింగ్ ఆధ్వర్యంలో యునిసెఫ్, అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా కాలేజీ భాగస్వామ్యంతో ఒక ప్రత్యేక నిమిషం నిడివి ఉండే చలనచిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు.
Also Read: Falcon Scam: రూ. 4,215 కోట్ల భారీ మోసం వెలుగులోకి!
చిత్రాల ద్వారా సామాన్యులకు అందించడమే లక్ష్యం
ఈ క్యాప్షన్‌తో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా ఇళ్లు, పాఠశాలలు, ఆఫీసులు, డిజిటల్ ప్రపంచంలో ఎదురవుతున్న అసురక్షిత వాతావరణంపై అవగాహన కల్పించనున్నారు. బ్యాడ్ టచ్, వేధింపులు, ట్రోలింగ్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండకుండా నిలదీసే ధైర్యాన్ని ఈ చిత్రాల ద్వారా సామాన్యులకు అందించడమే లక్ష్యమని చారు సిన్హా తెలిపారు. నేరాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె గుర్తుచేశారు. ‘ఫిలిం ఫెస్టివల్‌లో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వారు పాల్గొనవచ్చు. చిత్రం నిడివి ఖచ్చితంగా ఒక నిమిషం మాత్రమే ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించవచ్చు. ఎంపిక చేసిన విజేతలకు మార్చి 9న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేస్తారు’ అని చారు సిన్హా తెలిపారు.
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు మరో భారీ షాక్.. పెద్ద సంఖ్యలో సరెండర్.. ఎక్కడంటే?

