Liquor Sales: న్యూ ఇయర్ నేపథ్యంలో భారీగా మద్యం అమ్మకాలు
Liquor Sales ( image credit twitter)
Telangana News

Liquor Sales: న్యూ ఇయర్ నేపథ్యంలో భారీగా మద్యం అమ్మకాలు.. 6 రోజుల్లో ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా?

Liquor Sales: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ మద్యం ప్రియులు ఫూటుగా తాగేశారు. డిసెంబర్ 31న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచే మందుబాబులు దుకాణాల దగ్గర బారులు తీరారు. గతేడాది కంటే అధికంగా లిక్కర్​ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి.

మొత్తం రూ.1,350 కోట్లు

ఆరు రోజుల్లో మందుబాబులు ఏకంగా రూ.1,350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఏడాది చివరి ఒక్క రోజే 736 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. కేవలం మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడు రోజుల్లో 8.30 లక్షల లిక్కర్‌ కేసులు, 7.78 లక్షల బీర్ల కేసులు విక్రయించారు. గతేడాది ఒక్క డిసెంబర్‌ నెలలో రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈసారి రూ.5 వేల కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయినట్టు సమాచారం.

Also Read: Hyderabad Liquor Sales: ఇలా తాగేశారేంట్రా.. డిసెంబర్ 31 రాత్రి.. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్!

3,231 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు

మరోవైపు, ఎక్కడికక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించి పోలీసులు మందుబాబులపై ఉక్కుపాదం మోపారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ల‌లో దాదాపు 300 వంద‌ల పోలీస్ బృందాలు 3 వేల మంది మందుబాబుల‌పై కేసులు న‌మోదు చేశారు. హైదరాబాద్​ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,228, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 805 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా పోలీసులు వివరించారు.

పబ్బుల్లో డ్రగ్స్

మ‌రోవైపు, ఈగ‌ల్ టీమ్‌లు న‌గ‌రంలోని 60 పబ్బులపై ఆకస్మిక త‌నిఖీలు చేపట్టాయి. 4 ప్రముఖ పబ్బుల్లో డ్ర‌గ్స్ సేవించినట్లు గుర్తించారు. ఐదుగురు డీజేలు డ్రగ్స్ తీసుకొని మ్యూజిక్ ఆపరేట్ చేస్తున్నట్లు తేల‌డంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. న‌గ‌రంలోని బఫెలో వైల్డ్ వింగ్స్, షెర్లాక్ ఇల్యూషన్, వేవ్ పబ్‌లలో పనిచేస్తున్న డీజేలు డ్రగ్స్ ప్రభావంలో మ్యూజిక్ నిర్వహిస్తున్నారని అధికారులు నిర్ధారించారు. పబ్బుల సంస్కృతిలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భాగ్యనగరంలో డ్రగ్స్ రహిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తమ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Also Read: Drunk And Drive Test: హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

Just In

01

Sunil Kumar Arrest: రూ.28 కోట్ల పన్ను ఎగవేత.. కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్టు

Sridhar Babu: రేపటి తరాల కోసమే హిల్ట్ పాలసీ.. వెనక్కి తగ్గం.. ప్రతి దానికి సమాధానం చెబుతాం : మంత్రి శ్రీధర్ బాబు!

Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

Congress Party: కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అంశం మరోసారి చర్చ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలో పక్కా వ్యూహం!

Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. గంటకు 150 కి.మీ వేగం.. టికెట్ రూ.5 మాత్రమే?