జనం సొమ్మును దర్జాగా సొంత ప్రయోజనాలకు వాడుకున్న కథ ఇది! ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్మును వృథాగా ఖర్చు చేయకూడదని టీవీల ముందు డాంబికాలు పలికే నేతలూ పాత్రధారులుగా ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది!
ఒకప్పుడు మినిష్టర్ల శాలరీలు తక్కువ ఉన్న సమయంలో వెసులుబాటు కల్పించేందుకు ఉద్దేశించిన జీవోను తాము అధికారంలో ఉన్న పదేళ్లపాటు యథేచ్ఛగా వాడుకుని పబ్బం గడుపుకొన్న గులాబీ నేతల కతలే ఇవి! వచ్చే జీతాలు ఐటీ పరిధిలో లేకపోయినా.. లక్షలకు లక్షలు ఐటీని ఇతర శాఖల నుంచి చెల్లించిన చిత్రాలివి! మంత్రులందరికీ ఒకే పేస్కేల్ ఉన్నా.. ఒక్కొక్కరూ ఒక్కో మొత్తంలో పన్నులు చెల్లించిన విచిత్రాలివి.
ఆ చిత్రవిచిత్రాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.. ముఖ్యమైన మంత్రిగా చెలాయించిన కేటీఆర్ ఉన్నారు. కీలక మంత్రి హరీశ్‌రావు మొదలుకుని క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులంతా ఉన్నారు!
ఇంతకీ ఆ కథేంటి? కమామిషేంటి? స్వేచ్ఛ ఎక్స్‌ప్లోజివ్ చదవండి.. విస్తుపోయే నిజాలు.. విస్మయపర్చే అక్రమాలు! నేతలే మేతలైన కథలు!