Vanga NewYear: సందీప్ రెడ్డి కేక్ కటింగ్ స్టైల్ చూశారా..
Sandeep-Reddy-Vanga( image:X)
ఎంటర్‌టైన్‌మెంట్

Vanga NewYear: సందీప్ రెడ్డి కేక్ కటింగ్ స్టైల్ చూశారా.. కొత్త ఏడాదికి వెల్కమ్ పెద్దగా పలికాడు..

Vanga NewYear: సందీప్ రెడ్డి వంగా ఏం చేసిన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ చేసినా ప్రతిదీ చాలా ప్రత్యేకం. అలాగే న్యూయర్ వేడుకలు కూడా చాలా ప్రత్యేకంగా నిర్వహించారు. 2026 కి స్వాగతం పలుకుతూ జపనీస్ కటానాతో కేక్ కట్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంత పెద్ద కత్తితో కేకు కట్ చేయడంపై మరో సారి వంగా మార్క్ కేక్ కటింగ్ చూపించారంటూ కామెంట్లు పెడుతున్నారు. సందీప్ రెడ్డి వంగా ఏం చేసినా చాలా ఇలానే ఉంటుందని సందీప్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ జపనీస్ కటానాతోనే ఎందుకు కేక్ కట్ చేశాడు అనడానికి మాత్రం ఎక్కడా ఆయన వివరణ ఇవ్వలేదు. అయితే ఇది ఏదో పెద్దగా చేస్తున్నాను 2026 చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పడానికి సందీప్ రెడ్డి వంగా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అయితే కొత్త ఏడాది సందర్భంగా ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ వదిలారు. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ కటింగ్ ఇలా కూడా చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read also-Allu Arjun: స్టాఫ్‌తో న్యూయర్ వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఈ పోస్టర్ సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్సిటీకి అద్దం పడుతోంది. ప్రభాస్ వెనుక నుండి కనిపిస్తూ, ఒంటిపై రక్తం, గాయాలతో పవర్‌ఫుల్ లుక్‌లో ఉన్నారు. భుజాలపై ఉన్న బ్యాండేజీలు ఒక భీకరమైన పోరాటాన్ని సూచిస్తున్నాయి. పొడవాటి జుట్టు, గడ్డంతో ప్రభాస్ చాలా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నోట్లో సిగరెట్, ఒక చేతిలో మందు, మరొక వైపు ఒక మహిళ లైటర్ వెలిగిస్తుండటం.. సందీప్ వంగా సినిమాల్లో ఉండే వైల్డ్ నేచర్‌ను ప్రతిబింబిస్తోంది. దీంతో ఈలుక్ చూస్తుంటేనే సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా కేవలం భారత్‌లోనే కాకుండా చైనీస్, జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా గ్లోబల రేంజ్ రీచ్ ఉంటుందని ప్రభాస్ గ్లోబల్ రేంజ్ లో మరింత పాపులర్ అవుతాడని ఫ్యాన్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే సందీప్ మార్క్ టేకింగ్ వరల్డ్ క్లాస్ లో ఉంటుంది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆసిస్తున్నారు.

Read also-The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు

Just In

01

GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. ఇకపై ఫుడ్ సేఫ్టీ, ఇమ్యునైజేషన్‌పై ప్రత్యేక నిఘా..!

Kavitha Kalvakuntla: అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు.. కవిత సంచలన వ్యాఖ్యలు

Kamareddy Suicide Case: ఆన్ లైన్ గేమ్‌కు అలవాటుపడి.. యువకుడు సూసైడ్..!

Upcoming Smart Phones 2026: ఈ నెలలో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు

Water Supply: నగరవాసులకు అలర్ట్.. రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్