Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి
Ponnam Prabhakar (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీ కళా భవన్ లో గురువారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 (సడక్ సురక్ష – జీవన్ రక్ష) ప్రారంభోత్సవ వేడుక, ప్రమాద రహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రదానోత్సవం చేశారు. 30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లకు ప్రమాద రహిత డ్రైవర్లకు మంత్రి పురస్కారాలు అందజేసి మాట్లాడారు. గతంలో రోడ్డు భద్రతపై వారోత్సవాలు ఉండేవి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రాముఖ్యత గా తీసుకొని నెల రోజుల పాటు రోడ్డు భద్రత పై అవగాహన చేయాలని కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమం అన్నారు. రవాణా శాఖ ,ఆర్టీసీ మాత్రమే కాదు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కు ,పోలీస్ అధికారులు , విద్యా శాఖ , ఆర్ అండ్ బి అన్ని విభాగాల అధికారులు సమన్వయం తో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రవాణా శాఖ విద్యార్థులకు ఒక అప్లికేషన్ ఇస్తుందని, విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర రోడ్డు నిబంధనలు పాటిస్తాం.. అతి వేగం , డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని వారి సంతకంతో అఫిడవిట్ తీసుకొని ప్రభుత్వానికి తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.

ఇతరులకు ఆర్టీసీ ఆదర్శం

రోడ్డు భద్రత పై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని, రవాణా శాఖ అధికారులు 1000 ఉంటే రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయి..అందుకే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు జీవితాంతం బాధ పడుతున్నాయని, ప్రమాదాలను తగ్గించడానికి ఇతరులకు ఆర్టీసీ ఆదర్శంగా ఉండాలన్నారు. 20 వేల డ్రైవర్లు ,10 వేల బస్సులు 60 లక్షల ప్రయాణికులు , 39 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ మన లైఫ్ లైన్ అని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఉద్యోగుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యం మన లక్ష్యం అన్నారు. 260 కోట్ల మంది ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేశారు.. 8800 కోట్ల రూపాయలు ఆదా మనకు ఆదాయం అన్నారు.

Also Read: BRS: బీఆర్ఎస్‌కు పీడ కలగా 2025 సంవత్సరం.. అంతా అరిష్టమే..!

ఎక్కడెక్కడ బస్సులు అవసరం

ఆర్టీసీ మూసేస్తామని పరిస్థితి నుండి అన్ని డిపో లకు లాభాల్లోకి వస్తున్నాయన్నారు. కోటి కిలోమీటర్లకు ఒక ప్రమాదం జరుగుతుందని, ఆర్టీసీ ప్రమాదాలను జీరో స్థాయికి తగ్గించాలని, చలెగ బస్ క పయ్య .. హర్ గావ్ కి చలేగ బస్ క పయ్య అన్నారు. ఇప్పుడు నగరంలో 326 రూట్లలో కొత్తగా ఆర్టీసీ బస్సులు నడుపుతుందన్నారు. గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ బస్సులు అవసరం ఉన్నాయో మీరు రీప్రజెంటేషన్ ఇవ్వండి..అక్కడికి బస్సులు నడిపిస్తుందని తెలిపారు. ఆర్టీసీ రాష్ట్రంలోని నలుమూలల బస్సులు నడిపిస్తాం..రోడ్ సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి,మంత్రులు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం..రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు ,శాశ్వత వికలాంగులు అయిన కుటుంబాలు దుర్భరంగా ఉన్నాయన్నారు వెహికిల్ ఫిట్నెస్ ఉండాల్సిందే.. ఫిట్నెస్ ఉంటేనే బస్సులు రోడ్డెక్కించాలని ఆదేశించారు.రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు అవగాహన కల్పించాలి.. ఆర్టీసీ అగ్రభాగాన నిలబడి ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఆర్టీసీ కుటుంబాలు అంత 2026 లో పాత బకాయిలు అన్ని పోయి మనం ముందుకు పోవాలని సూచించారు. మరింత శ్రమ పడదాం..బంగారు భవిషత్ ఉండాలి. తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు మన పాత్ర ఉండాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఈడి లు అధికారులు పాల్గొన్నారు.

Also Read: Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే వందే భారత్ స్లీపర్ సేవలు.. కేంద్రం ప్రకటన

Just In

01

Govt Employees: ఉద్యోగ సంఘాలకు కొత్త ఏడాది గుడ్ న్యూస్!.. సీఎం రేవంత్ కీలక సందేశం?

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Kishan Reddy: బస్తీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఎక్కడక్కడంటే?

The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు

New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?