Damodar Rajanarasimha: రాష్ట్రంలో ఈ ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్!
Damodar Rajanarasimha (imagecredit:swetcha)
Telangana News

Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Rajanarasimha: దశాబ్దాల ఉస్మానియా నూతన హాస్పిటల్‌ ఆకాంక్షను 2025లో నెరవేర్చుకున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Dhamodhara Rajanarasimha) గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులకు కొత్త భవనాలను నిర్మించుకున్నామన్నారు. 2026లో 4 కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. గుండె, కిడ్నీ జబ్బులు, కేన్సర్ వంటి మొండి వ్యాధులకు సైతం పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా ఈ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య విద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి బుధవారం ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..

ఎన్‌సీడీలపై ఫోకస్

2026లో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌ నివారణ, నియంత్రణ, చికిత్స, పాలియేటివ్ కేర్‌పై మరింత ఫోకస్ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌సీడీసీ క్లినిక్స్, డే కేర్ కేన్సర్ క్లినిక్స్ ద్వారా గ్రామాల సమీపంలోకి వైద్య సేవలను తీసుకెళ్లామని మంత్రి గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను విస్తృతం చేస్తున్నామని, 2026లో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా క్రిటికల్ కేర్ బ్లాక్స్, ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొస్తామని‌ మంత్రి తెలిపారు. పది నిమిషాల్లోనే ఘటన‌ స్థలానికి చేరుకుని వైద్య సేవలు ప్రారంభించేలా ‘108 అంబులెన్స్’ సర్వీసెస్‌ను ఎక్స్‌పాండ్‌ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది అని మంత్రి పేర్కొన్నారు. దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎంత శుభ్రతను పాటిస్తామో, అదే విధంగా ప్రభుత్వ దవాఖాన్లకు కాపాడుకుందామని మంత్రి పిలుపినిచ్చారు‌.

Also Read: Shocking Incident: రూ.50 పందెం కోసం.. పెన్ను మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత చూస్తే..

Just In

01

Minister Seethakka: బొకేలు వద్దు.. బ్లాంకెట్లు తీసుకురండి.. మంత్రి సీతక్క కీలక సూచన

Rukmini: నటకిరీటి వదిలిన హారర్ కామెడీ మూవీ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు

Honey Glimpse: భయపెడుతోన్న నవీన్ చంద్ర.. ‘హనీ’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Kawasaki Z650RS: భారత్‌లో లాంచ్ అయిన కవాసాకి Z650RS.. E20 ఫ్యూయల్ సపోర్ట్‌తో