Krishna Vamsi: ‘మురారి క్లైమాక్స్’పై కృష్ణవంశీ పోస్ట్ వైరల్!
Krishna Vamsi Murari (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Krishna Vamsi: ‘మురారి క్లైమాక్స్’పై కృష్ణవంశీ పోస్ట్ వైరల్!

Krishna Vamsi: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నటించిన ‘మురారి’ (Murari) రీ రిలీజ్ సందర్భంగా.. దర్శకుడు కృష్ణవంశీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చిన్న చిన్న ఆన్సర్స్‌తో ట్రెండ్‌లో ఉంటే కృష్ణవంశీ (Krishna Vamsi).. ఈసారి ఆ సినిమా క్లైమాక్స్ విషయంలో తను ఎంత టెన్షన్ పడిందీ ఇందులో వివరించారు. మహేష్ బాబు ఎంత గొప్పనటుడో, క్లైమాక్స్‌లో ఆయన ఏం చేశారో, ఎలా చేశారో తెలిస్తే.. ఆయన అభిమానులు ఆనందం పట్టలేదు. అసలింతకీ క్లైమాక్స్ గురించి కృష్ణవంశీ ఏం చెప్పారంటే.. కృష్ణవంశీ ట్వీట్‌లో చెప్పిందిదే..

కృష్ణవంశీ ట్వీట్‌లో చెప్పిందిదే..

‘‘మురారి మొదలైంది.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ పతాక సన్నివేశం ఎలా అనేది తెగడం లేదు. మనసులో, మస్తిష్కం‌లో అలజడిగా వుంది. అన్ని సన్నివేశాలు అద్భుతంగా అమరుతున్నాయి.. కానీ, క్లైమాక్స్ అస్పష్టంగానే వుంది. చిల్లర మసాలా చిత్రంలా ఒక ఫైట్‌తో ముగించాలని లేదు. ఏదో అద్భుతం జరగాలి. సరే అని తెగించి ఒక ఆలోచనని పట్టుకున్నా. తనే చచ్చిపోతున్నాను అని మురారికి తెల్సిపోయింతర్వాత ఛత్ అదేం కుదరదని తన చావుకీ, బామ్మ మాటకీ ఎదురెల్తాడు. దైవశక్తికీ, తన స్వశక్తిని అడ్డం వేస్తాడు. కానీ, బుల్లిగాడు గునపం దించేశాడు. బొట్టు బొట్టులో ప్రాణం జారిపోతుంది. వసు ఇది చూసి స్రృహ తప్పింది. బుల్లిగాడు రక్తం చూసి కంగారొచ్చేసి పారిపోయాడు. విశాలమైన పొలాల మధ్యలో కనుచూపు మేరలో ఎవరూ లేరు. తిరిగొస్తానని బామ్మకి మాటిచ్చాడు. స్రృహ‌లో లేని వసుని అక్కడినుంచి తీసుకెళ్ళి పోవాలి. ఏ సహాయం లేదు, రాదు.. శరీరం సహకరించడం లేదు. ప్రాణం పోతూపోతూ వుంది, నాకు నేనే కూడగట్టుకోవాలి. నేను ఏ తప్పూ చేయనప్పుడు నేనెందుకు లొంగాలి.. చావైనా సరే నేను తగ్గను అంటూ.. అనుకుంటూ నాకు నేనే వున్నానని గొప్పగా అనిపించింది కాన్సెప్ట్ అంతా. ఇక మొత్తం మహేష్‌కి ఎక్కించా. చుట్టూ పంచభూతాలు తప్ప ఎవరూ వుండరు ఏమీ వుండదు. ప్రాణం పోతున్న నొప్పి, ఎవరూ లేని అసహాయత, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, వసూని తీసుకెళ్ళి పోవాలి. బామ్మ ఆఖరి పూజకి అందుకోవాలి. చావకూడదు, బతకాలి.. వసూని పెళ్లి చేసుకోవాలి. తల నిండా చిత్రమైన మంచీ చెడూ ఆలోచనలు.. నవ్వొస్తూంది, ఏడుపొస్తాంది, నవ్వాలి, ఏడవాలి, గంతులెయ్యాలి, డాన్స్ చేయాలి నొప్పితో. నొప్పిని ఆపుకోవడానికి పాటపాడాలి, అరవాలి. గుర్తొచ్చి మట్టితో గాయం మీద రాసుకోవాలి. పిచ్చిపిచ్చిగా, తిక్కతిక్కగా అటూ ఇటూ తిరగాలి. అమ్మ గుర్తొస్తోంది, అందరూ గుర్తొస్తున్నారు, మొత్తానికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి… సంకల్పం అంతే.

Also Read- Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!

నన్ను చంపేసే ఉపద్రవం

మొత్తం అర్థమయేలా మహేష్‌కి వివరించా. గునపం గుచ్చుకున్న దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ ఏం చేయాలో చిన్న గుర్తులతో చెప్పా. రిహార్సల్ వద్దు డైరెక్ట్ టేక్ అన్నా. ఒక సెకన్ నన్ను సూటిగా చూసి రడీ సార్ అన్నాడు. ఈ సీన్ కోసమే రామలింగేశ్వరరావు గారికి మూడు కెమెరాలు కావాలని అడిగా.. ఓకే సార్ అన్నారు. మూడు కెమెరాలు, లైటింగ్ అమరుస్తూ మహేష్ ఒక్కడ్నీ పది నిమిషాలు వదిలేసా. మొత్తం ఆ ప్రదేశం అంతా యూనిట్ వందమంది, షూటింగ్ చూడటానికి వచ్చిన ఒక వెయ్యి మంది నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. మహేష్ తప్ప తెరమీద ఇంకెవ్వరూ కనపడని సన్నివేశం, ఏమాత్రం ఈషణ్మాత్రం తేడా అభాసుపాలు అయిపోయే అవకాశం. మహేష్ ఒక సూపర్ స్టార్‌గా ఒక నటుడిగా మేక్ ఆర్ బ్రేక్. తేడా జరిగితే సీనియర్, జూనియర్ సూపర్ స్టార్ అభిమానులు డైరెక్టర్‌గా నన్ను చంపేసే ఉపద్రవం. కానీ నాకు మహేష్ మీద మనసు మూలల్లో నాకే అర్థం కానీ నమ్మకం వుంది. కెమెరాస్ రడీ అన్నాడు రాంప్రసాద్.. రడీయా మహేష్ అని కూడా అడగలేదు. క్లాప్ అని అసంకల్పితంగా వచ్చేసింది. మహేష్ ఏం మాట్లాడలేదు, పొజిషన్‌లోకి వెళ్లి పోయాడు. యాక్షన్. అంతే… ఏకధాటిగా మూడు నిముషాల నలభై సెకన్లు, ఆఖరులో కుండలో నీళ్ళు మొహం మీద ఒంపుకొని దాన్ని విసిరేస్తూ అదుపుతప్పి కింద పడిపోగానే కట్ చెప్పాను. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ యూనిట్ అంతా కూడా చప్పట్లహోరు. ఆగకుండా పది నిమిషాలు కొట్టేశాం అని అర్థం అయింది. ఆర్నెల్ల ఆత్రత, అలజడి కుదుటపడింది. దటీజ్ మహేష్’’.

Also Read- Geetha Arts 2025: ఒక మధుర జ్ఞాపకం.. 2025 జర్నీపై గీతా ఆర్ట్స్ నుంచి ఎమోషనల్ ట్వీట్!

P.S. ముందు రోజు రాత్రి షూటింగ్ అరటితోట ఫైట్ అయిన తరువాత మరుసటిరోజు ఈ సీను షూటింగ్. అప్పటినుండి షూట్ అయ్యేంతవరకు ఏమీ తినొద్దు, మంచి నీళ్ళు, కాఫీ తప్ప. నాకు అప్పటికే రెండవరోజు, సరే సార్ డైరెక్టర్ గారూ అని రామలింగేశ్వరరావు గారింటి నుంచి వచ్చిన డిన్నర్ క్యారేజీ‌ని అసిస్టెంట్ లకి పంపించేసాడు. పస్తున్నాడు ఎఫెక్ట్ కోసం. చాలా ఎత్తుకి ఎదుగుతాడు, కృష్ణ గారి పేరు ఇంకా పైకెత్తుతాడు అని కనపడి పోయింది.. అని కృష్ణవంశీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Krishna Vamsi: ‘మురారి క్లైమాక్స్’పై కృష్ణవంశీ పోస్ట్ వైరల్!

Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్!

Bhootham Praytham: ‘భూతం ప్రేతం’ న్యూ ఇయర్ స్పెషల్‌ ‘చికెన్ పార్టీ’ సాంగ్ చూశారా?

The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ ‘రాజే యువరాజే’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్‌తో 2025 బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ‘మీసాల పిల్ల’!