Rajinikanth 173: ‘థలైవర్ 173’ చిత్రానికి 'పార్కింగ్' దర్శకుడు!
Rajinikanth-173(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rajinikanth 173: రజనీకాంత్ ‘థలైవర్ 173’ చిత్రానికి ‘పార్కింగ్’ దర్శకుడు!.. షూటింగ్ ఎప్పుడంటే?

Rajinikanth 173: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కెరీర్‌లో 173వ చిత్రాన్ని ఎవరితో చేస్తారనే ఉత్కంఠకు తెర పడబోతోంది. గత కొన్ని రోజులుగా పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ‘పార్కింగ్’ ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ మెగా ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సినీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మొదట ఈ సినిమా రేసులో పలువురు దర్శకులు ఉన్నప్పటికీ, రజనీకాంత్ ఇప్పుడు యువ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. రామ్‌కుమార్ చెప్పిన కథలోని కొత్తదనం, స్క్రీన్ ప్లే రజనీకి బాగా నచ్చాయని, దాదాపు ఆయనే దర్శకుడిగా ఖరారయ్యారని ఇండస్ట్రీ టాక్. అయితే, ఇదే సమయంలో ‘ఓ మై కడవులే’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా తన కథతో రజనీని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీరిద్దరిలో రామ్‌కుమార్ వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది.

Read also-Anvesh Controversy: చైనా జపాన్ ఏదేదో సాధిస్తుంటే మనం ఇంకా చీర దగ్గరే ఉన్నాం.. అన్వేష్ వైరల్ కామెంట్స్..

రజనీకాంత్ ప్రస్తుతం ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్ల కథలను లోతుగా పరిశీలిస్తున్నారు. వచ్చే నెల (జనవరి 2026) లో దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఒక భారీ బడ్జెట్ చిత్రంతో సూపర్‌స్టార్‌ను డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఈ సినిమా సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించినా, కథలో మార్పుల వల్ల ఈ కాంబో కుదరలేదు. తర్వాత ఈ సినిమాకు చాలామంది దర్శకులను పరిశీలించారు. కానీ చివరిగా పార్కంగ్ దర్శకుడు ఖరారు అయినట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన్ రావాల్సిందే.

Read also-Bandla Ganesh: మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అది ఏంటంటే?

ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇద్దరు దిగ్గజ నటులు (రజనీకాంత్ – కమల్ హాసన్) కలసి ఒక ప్రాజెక్ట్ కోసం పని చేయడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2026 ఏప్రిల్ నుండి #Thalaivar173 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యువ దర్శకుడైన రామ్‌కుమార్ బాలకృష్ణన్ తన మేకింగ్ స్టైల్‌తో రజనీకాంత్‌ను ఎలా చూపిస్తారో అని అభిమానులు ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Just In

01

Municipal Elections: పట్టణాల్లో ఎన్నికల వేడి.. ఆశావహుల్లో ఉత్కంఠ

New Year 2026 Wishes : మీ ప్రియమైన వారికీ న్యూ ఇయర్ విషెస్ ఇలా చెప్పేయండి!

Harish Rao on CM Revanth: నాడు ఉద్యమ ద్రోహి.. నేడు నీళ్ల ద్రోహి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరొద్దు.. ఖమ్మం పోలీస్ కమిషనర్ వార్నింగ్

Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?