Anvesh Controversy: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చెలరేగిన చీర వివాదం తారా స్థాయికి చేరుకుంది. దీనికి కారణమైన యాక్టర్ శివాజీ పై వ్యతిరేకత రావడంతో క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగు యూట్యూబ్ ఇన్ఫూయెన్సర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మరొక్కసారి దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై అన్వేష్ తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మందిని అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ అన్వేష్ కూడా క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా పెట్టిన పోస్టలో దేశాన్ని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా పెట్టన వీడియోలో అన్వేష్ ఏం అన్నాడంటే.. నన్ను క్షమించమన్నా ఎవరూ నన్ను క్షమించడంలేదు.. సరే అయితే నిజాలు మాట్లాడుకుందా.. అమెరికా చైనా, జపాన్లు అభివృద్ధి సాధిస్తుంటే.. మనం ఇంకా ఆ చీర దగ్గరే ఆగిపోయాం. ఈ థాయ్లాండ్ చూడండి.. 2000 లో ఒక రూపాయి, ఒక థాయ్ బాట్ తో సామానం ఇప్పడు మూడు రూపాయలు అయింది. అంటే ఇవన్నీ పక్కన పెట్టి.. మనం మన సంస్కృతి అంటూ తిరుగుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఆలో చించండి సంస్కృతి అంటూ తిరుగుతున్న దేశాలు.. ఇరాన్, ఇరాక్, అఫ్గనిస్తాన్ లు ఇంకా పేదరికంలోనే కూరుకుపోతున్నాయి. మనం కూడా అలాగే ఆలోచిస్తాము. అంటూ దేశం గురించి, దేశ సంస్కృతి గురించి అనరాని మాటలు అన్నాడు. దీనిని చూసిన నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇదిలా ఉండగా సీతమ్మ గురించి మరో వీడియో విడుదల చేశాడు. “నా అన్వేషణ” అన్వేష్ ఈ వీడియోలో స్త్రీ స్వేచ్ఛ మరియు భద్రతపై చాలా గట్టిగా స్పందించారు. గత రెండేళ్లలో దేశంలో సుమారు 60 వేల అత్యాచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, వీటికి కారణం మహిళల వస్త్రధారణ కాదని ఆయన స్పష్టం చేశారు. చీరలు కట్టుకున్న వారు, చిన్న పిల్లలు కూడా ఈ దాడులకు గురవుతున్నారని గుర్తు చేశారు. స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత ఇష్టమని, మగవారికి లేని నిబంధనలు ఆడవారికే ఎందుకని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ ఉండటం వల్లే ఆ దేశాలు అభివృద్ధి చెందాయని, మన దేశంలో ఇంకా పాత ఆలోచనలతో వారిని అణచివేయడం సరికాదన్నారు. స్త్రీల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, సమాజం మారాల్సింది వారి ప్రవర్తనలో తప్ప మహిళల వస్త్రధారణలో కాదని అన్వేష్ ఈ వీడియో ద్వారా బలంగా వాదించారు. అంతే కాకుండా తాను ఇలాగే మాట్లాడతా ఉంటానని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.
Read also-Bandla Ganesh: మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అది ఏంటంటే?

