Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..!
Municipal Elections (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఉత్తర్వులు జారీ..!

Municipal Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు , 6 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రా(Rani)ణి కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు. 1అక్టోబర్ 2025 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఈ మున్సిపల్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ డిసెంబర్ 30 నుండి ప్రారంభమై జనవరి 10 వరకు కొనసాగుతుంది. ఇక మున్సిపల్ కమీషనర్లు తమ పరిధిలోని వార్డుల వారీగా ఫోటో గుర్తింపు కలిగిన ఓటర్ల జాబితా తయారీకి బాధ్యత వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఫార్మాట్‌లోనే మున్సిపల్ జాబితా కూడా ఉంటుంది. జనవరి 1న ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత, పేర్లు లేదా చిరునామాల్లోమార్పులు-చేర్పులకు సంబంధించి అభ్యంతరాలు తెలపవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమీషనర్లకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Illegal Sand Mining: మసక మసక చీకట్లో అక్రమ ఇసుక రవాణా.. రాత్రి అయిందంటే రయ్ రయ్!

షెడ్యూల్, ముఖ్యమైన తేదీలు

ఈసీఐ డేటాను మున్సిపాలిటీల వారీగా విభజించడం

తేదీ 30.12.2025

వార్డుల వారీగా ఓటర్ల డేటా పునర్వ్యవస్థీకరణ

తేదీ.31.12.2025

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ (అభ్యంతరాల స్వీకరణ)

తేదీ. 01.01.2026

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ స్థాయిలో సమావేశం

తేదీ. 05.01.2026

జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం

తేదీ. 06.01.2026

ఓటర్ల తుది జాబితా ప్రచురణ తేదీ.10.01.2026

Also Read: Allu Sirish Wedding Date: అల్లు ఇంట పెళ్లి భాజాలు.. శిరీష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ వీడియోతో డేట్ రివీల్

Just In

01

Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల.. వార్షిక నివేదిక విడుదల

Sikkim Sundari: అంతుచిక్కని రహస్యం.. రాతి నుంచి పుట్టుకొచ్చే.. అరుదైన హిమాలయ పువ్వు!

Baba Vangas 2026 Prediction: 2026లో ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా అంటున్న బాబా వంగా.. మీ రాశి ఉందా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డతో మూవీ అనౌన్స్ చేసిన నిర్మాత నాగవంశీ.. దర్శకుడు ఎవరంటే?

KTR: పాలమూరు పై నిర్లక్ష్యం ఎందుకు?.. ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు: కేటీఆర్