Champion Movie: బాక్సాఫీస్ వద్ద 'ఛాంపియన్' జైత్రయాత్ర..
champion-collections(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Champion Movie: బాక్సాఫీస్ వద్ద ‘ఛాంపియన్’ జైత్రయాత్ర.. మూడు రోజుల గ్రాస్ ఎంతంటే?

Champion Movie: టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేకా కథానాయకుడిగా నటించిన పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ సునామీని సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.8.89 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా, శని, ఆదివారాల్లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా నైజాం మరియు ఆంధ్ర ప్రాంతాల్లోని ఏ సెంటర్ల నుంచి మాస్ సెంటర్ల వరకు ప్రతిచోటా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు తరలిరావడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఏడాది చివర్లో మంచి విజయం సాధించిన సినిమాగా ‘ఛాంపియన్’ నిలిచింది.

Read also-45 Movie: సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న ‘ది 45’.. రిలీజ్ ఎప్పుడంటే?

1940ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక సామాన్య ఫుట్‌బాల్ క్రీడాకారుడు తన కలను నిజం చేసుకోవడానికి పడే తపనను కళ్లకు కట్టినట్లు చూపించింది. రోషన్ మేకా తన మునుపటి చిత్రాల కంటే ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచారు. మైఖేల్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు, ముఖ్యంగా ఫుట్‌బాల్ మ్యాచ్ సన్నివేశాల్లో చూపిన వేగం మరియు ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొవడంతో మూడేళ్ల తర్వాత వస్తున్న రోషన్ కు ఉపశమనం కలిగింది.

Read also-Khudiram Bose Movie: తొలి చిత్రంతోనే దేశ చరిత్రను ఆవిష్కరించిన రాకేష్ జాగర్లమూడి.. ‘ఖుదీరాం బోస్’ ముచ్చట్లు

వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు ప్రదీప్ అద్వైతం పీరియడ్ సెటప్‌ను చాలా సహజంగా తీర్చిదిద్దారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ‘గిరగీర’ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. అనస్వర రాజన్ మరియు అవంతిక వందనపు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక పరిపూర్ణమైన స్పోర్ట్స్ డ్రామా రావడం, దానికి పీరియడ్ టచ్ ఇవ్వడం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తోంది. ఇదే జోరు కొనసాగితే, ఈ చిత్రం రోషన్ మేకా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం.  ఇప్పటికే రోషన్ అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమాకు సైన్ కూడా చేశారు. అంటే  ఈ సినిమా విజయం ఎంతటి ప్రభావం చూపిందో తెలుసుకోవచ్చు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సినిమా రానున్న రోజుల్లో మంరెంత్ బిజినెస్ చేస్తుంతో చూడాలి మరి.

Just In

01

Medaram Jatara: మేడారం ఆలయానికి భారీగా పోటెత్తిన భక్తులు

Bhatti Vikramarka: అభివృద్ధిలో మధిర పట్టణం ఉరకలు పెట్టాలి: భట్టి విక్రమార్క

Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..

MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీనే‌ దేశానికి రక్ష: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం.. విచారణలో నమ్మలేని నిజాలు.. ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనా?