45 Movie: సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న ‘ది 45’..
the-45-movie
ఎంటర్‌టైన్‌మెంట్

45 Movie: సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న ‘ది 45’.. రిలీజ్ ఎప్పుడంటే?

45 Movie: కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

Read also-Khudiram Bose Movie: తొలి చిత్రంతోనే దేశ చరిత్రను ఆవిష్కరించిన రాకేష్ జాగర్లమూడి.. ‘ఖుదీరాం బోస్’ ముచ్చట్లు

శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘వేద’ తరువాత మళ్లీ ‘45’ మూవీ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. నాలుగైదు నిమిషాల్లోనే అర్జున్ జన్య అద్భుతంగా స్టోరీని నెరేట్ చేశారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా అనిపించింది. ఈ కథను మీరే డైరెక్ట్ చేయండని అర్జున్ కి సలహా ఇచ్చాను. ముందుగా ఓ రెండు మూడే సీన్లు యానిమేషన్స్‌లో అర్జున్ చిత్రీకరించారు. రమేష్ ఆ సీన్లు చూసి సినిమా అవకాశం ఇచ్చారు. అర్జున్ తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు. తెలుగులో మా మూవీని మైత్రి రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. కన్నడలో ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతీ ఒక్క ప్రాణిని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు. ఎన్ని రోజులు భూమ్మీద బతుకుతామో తెలీదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని ఈ మూవీ చెబుతుంది. సత్య కెమెరా వర్క్, రవి వర్మ ఫైట్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. అర్జున్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అవుతారు. ఈ మూవీ అందరినీ మనస్పూర్తిగా ఆకట్టుకుంటుంది. జనవరి 1న మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

ఉపేంద్ర మాట్లాడుతూ .. ‘అర్జున్ కథను నెరేట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలుసు. ఈ కథను నెరేట్ చేసేటప్పుడు ప్రతీ పాత్రను యాక్ట్ చేసి మరీ చూపించారు. ముందుగా ఓ సీన్‌ను చిత్రీకరించాడు. దానికి డీఐ, డబ్బింగ్ కంప్లీట్ చేసి నిర్మాతకు థియేటర్లో చూపించారు. ఆ తరువాత ఈ మూవీని స్టార్ట్ చేశాం. శివన్నని ఇంత వరకు ఇలా ఎక్కడా కూడా, ఏ సినిమాలో కూడా చూడలేదు. స్క్రీన్ ప్లే పరంగా అర్జున్ అద్భుతం చేశారు. ఈ మూవీ తరువాత అర్జున్ పెద్ద దర్శకుడిగా మారిపోతారు. నాకు ఇంత వరకు ఎవ్వరూ ఇవ్వని పాత్రను చాలా డేరింగ్‌గా అర్జున్ నాకు ఇచ్చారు. ఆయన్ను చూస్తే సౌమ్యంగా ఉంటారు.. కానీ తెరపై మాత్రం విధ్వంసం సృష్టించారు. తెలుగు వాళ్లు మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తారు. జనవరి 1న మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Read also-Shambala Movie: హిందీ డబ్బింగ్‌కు సిద్ధమవుతున్న ఆది ‘శంబాల’.. అక్కడ రిలీజ్ ఎప్పుడంటే?

దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ .. ‘‘45’ మూవీలో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతోన్నారు. మూడున్నరేళ్లుగా ఈ మూవీ కోసం కష్టపడ్డాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివన్నకి, ఉపేంద్రకి థాంక్స్. రాజ్ బి శెట్టి గారు అద్భుతంగా నటించారు. మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రి శశి గారికి థాంక్స్. ఆయన ఇచ్చిన సలహాలు మాకెంతో ఉపయోగపడ్డాయి. జనవరి 1న మా మూవీని చూసి అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు. నిర్మాత రమేష్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘45’ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాని చూస్తే దీని విలువ తెలుస్తుంది. గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది. శివన్న, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి అద్భుతంగా చేశారు. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. జనవరి 1న ఈ మూవీని అందరూ కుటుంబ సమేతంగా చూడండి’ అని అన్నారు.

Just In

01

Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం.. విచారణలో నమ్మలేని నిజాలు.. ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనా?

Driving Licence: వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి కోసం మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

IED Bombs: కర్రెగుట్టల్లో భారీగా ఐఈడి బాంబులు కలకలం

RGV Shivaji: శివాజీ మాటలకు ఆర్జీవీ ఫైర్ అవ్వడానికి కారణం ఇదే?.. ఇద్దరికీ తేడా ఏంటి?

Chiranjeevi Anil: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో పోస్టర్ రిలీజ్.. ఇంకా పదిహేను రోజులే..