Doctors Demands: కొత్త మెడికల్ కాలేజీల్లో అలవెన్స్ ఇవ్వాలని, దీంతో ప్రోఫెసర్లకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వ వైద్యుల సంఘం డాక్టర్లు నరహరి(Narahari), లాలూ(Lalu), రవూప్(Ravup)లు పేర్కొన్నారు. శనివారం వీరు డీఎంఈ కార్యాలయంలో మాట్లాడుతూ.. టీవీవీపీని డైరెక్టరేట్ గా మార్చినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
అడ్డంకులు లేవని..
గత ప్రభుత్వంలోనే ఏపీ తరహాలో చేయాలని రిపోర్టు ఇచ్చినప్పటికీ, రెండేళ్లు గడుస్తున్నా.. పూర్తి కాకపోవడం విచారకరమన్నారు. డైరెక్టరేట్ గా మార్చితే జీతాలు కూడా సకాలంలో లభిస్తాయన్నారు. ఆస్కీ వంటి సంస్థలు కూడా ఆర్ధిక, న్యాయపరమైన అడ్డంకులు లేవని స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేశారు. దీంతో పాటు రీ డిప్లాయ్ మెంట్(Redeployment), ప్రమోషన్లనూ వేగంగా పూర్తి చేయాలన్నారు. టీవీవీపీ అధికారులు వేగంగా స్పందించి, సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ను అమలు చేయాలన్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ ఆర్డర్లు వెంటనే జారీ చేయాలన్నారు.
Also Read: Prakash Raj: మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. నటుడు ప్రకాష్ రాజ్
రెగ్యులర్ రిక్రూట్‌మెంట్
వైద్యులకు నిమ్స్(Nims) తరహాలో పే స్కేల్స్‌ను అమలు చేయాలన్నారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు ముందు సరెండర్స్ పూర్తి చేయాలన్నారు.పెరిఫెరల్ సంస్థల నుంచి హైదరాబాద్(Hyderabad)కు ఫ్యాకల్టీ బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. ఎంఎన్ జే తదితర స్వయం ప్రతిపత్తి కలిగిన మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ కాలేజీలుగా మార్చాలన్నారు. ఉస్మానియా, ఎంజీఎం హాస్పిటళ్ల సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ పోస్టులను వెంటనే సృష్టించాలన్నారు. జీవో 142 సవరించాలన్నారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు పూర్తి చేయాలన్నారు. ఏవోలకు అధిక పవర్స్ ఇవ్వడం నిలిపివేయాలన్నారు. పెండింగ్ లోని డీఏలు, పీఆర్ సీ, తో పాటు రిటైర్మెంట్ బెన్ ఫిట్ లను అందజేయాలన్నారు.
Also Read: Delhi Murder Suicide: దేశంలో మరో ఘోరం.. సిగరేట్‌కు రూ.20 ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త

