Bigg Boss Sanjana: ఈ గెలుపు నాది కాదు
నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది
మీడియాతో హీరోయిన్ సంజనా గర్లాని
తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన బిగ్ బాస్ సీజన్-9 ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. టాప్-5 ఫైనలిస్ట్‌గా నిలిచిన హీరోయిన్ సంజన (Bigg Boss Sanjana) శనివారం నాడు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోకు సంబంధించిన తన అనుభవాలను, అనుభూతులను ఆమె మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
ఐదేళ్ల క్రితం తన ప్రమేయం లేకుండా జరిగిన ఓ ఘటన తన జీవితాన్ని,కెరీర్‌ను ఒక కుదుపు కుదిపేసిందని సంజన చెప్పారు. తాను స్వతహాగానే ఫైటర్‌ను అని, అందుకే ప్రతికూల పరిస్థితులతో పెద్ద పోరాటమే చేశానని, చివరికి విజేతగా నిలిచానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్
బిగ్‌బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్‌లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నట్టు సంజన తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్లీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు బిగ్ బాస్ కారణంగా నిలిచిందని, అందుకే, ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా చెప్పారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక తాను మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె అన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని సంజన వెల్లడించారు.
బిగ్‌హౌస్‌లో తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘విజనరీ వౌస్’కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్‌గా సంజనా గర్లాని నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’లో త్రిష చెల్లెలిగా ఆమె నటించింది. ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించింది.
Read Also- Digvijaya Singh: మోదీ పాత ఫొటో షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు బహిర్గతం?

