Wine Shop Owner: వైన్స్ షాప్ యజమాని ఇంట్లో షాకింగ్ సీన్
Fake-Wine (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Wine Shop Owner: వైన్స్ షాప్ యజమాని ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లు… అంతా షాక్

Wine Shop Owner: కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం

వైన్స్ షాప్ యజమాని ఇంట్లోనే లభ్యమైన బాటిళ్లు
స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
తూతూమంత్రంగా కేసు నమోదు
వైన్ షాప్ యజమానిని కాపాడే యత్నం!
ఎక్సైజ్ అధికారుల తీరుపై జనాల్లో అనుమానాలు

కారేపల్లి, స్వేచ్ఛ: కంచే చేను మేసిన చందంగా ఉందంటూ కారేపల్లి ఎక్సైజ్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ మద్యంపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులే, కల్తీమద్యం తయారీదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఓ వైన్ షాప్ యజమాని ఇంట్లో శుక్రవారం నాడు సోదాలు జరిపి 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ఒక రోజంతా గోప్యంగా ఉంచి కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని కూడా శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు వెల్లడించారు. దీంతో, కేసు నమోదు చేసిన విషయాన్ని దాచిపెట్టడం వెనుక మతలబు ఏంటంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also- Battle Galwan: సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ వచ్చేసింది.. గల్వాన్ వీరుల త్యాగానికి సెల్యూట్..

విశ్వసనీయ సమాచారం మేరకు… ఎక్సైజ్ అధికారులు 30 బాటిళ్లు స్వాధీనం చేసుకోగా, బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్‌కు చెందిన 16 మద్యం బాటిళ్ల మూతలు తీసి కల్తీ చేసినట్లు సమాచారం. దొరికిన బాటిళ్లను రీజనల్ కెమికల్ ల్యాబ్‌కు పంపడంతో కల్తీ భాగోతం బయటపడుతోంది. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో పాటు వైన్స్ షాప్ యజమానిని కాపాడటం కోసం తూతూ మంత్రంగా కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘‘మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నాం, కేసు కూడా నమోదు చేశాం’’ అని ఎక్సైజ్ ఎస్సై వసంత లక్ష్మి, సీఐ ప్రశాంతి విలేకరులకు వివరాలు వెల్లడించినప్పటికీ కేసు నమోదు చేసిన తీరునుబట్టి వైన్స్ షాప్ యజమానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి.

Read Also- Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. దేశం వీడిన 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజనీర్లు.. కారణం ఏంటంటే?

వివరాలు వెల్లడించడానికి ఎందుకు జాప్యం చేశారని, అంతలా గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందనే ప్రచారంపై ఎక్సైజ్ అధికారులు స్పష్టతనియాల్సిన అవసరం ఉందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. బెల్ట్ షాపుల్లో ఫుల్ బాటిళ్లు ఉండకూడదనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ ఈ వైన్ షాప్ యజమాని తన ఇంట్లో భారీగా ఫుల్ బాటిళ్లు ఉంచుకొని అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నా ఎక్సైజ్ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి, దీనిపై అధికారులు క్లారిటీ ఇస్తారో వేచిచూడాలి.

Just In

01

Hyderabad Crime Rate: హైదరాబాద్‌ క్రైమ్ రిపోర్ట్ విడుదల.. నేరాలు ఎలా ఉన్నాయంటే?

Football Match Funds: ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వాడిన రూ.110 కోట్లపై ఎంక్వయిరీ చేస్తాం: హరీష్ రావు

KTR: తెలంగాణలో మార్పు మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్

Bigg Boss Sanjana: నా ప్రమేయం లేకుండా ఓ ఘటన.. బిగ్‌బాస్ టాప్-5 ఫైనలిస్ట్ సంజనా ప్రెస్‌మీట్

DGP Shivadhar Reddy: సీఐ, ఎస్‌ఐలపై డీజీపీ శివధర్ రెడ్డి ఫుల్ సీరియస్.. అలా చేస్తే వేటు!