Shivaji Inquiry: మహిళా కమీషన్ ముందు హాజరైన్ శివాజీ . .
mahila-kamishan
ఎంటర్‌టైన్‌మెంట్

Shivaji Inquiry: మహిళా కమీషన్ ముందు హాజరైన్ శివాజీ . . కమీషన్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే?

Shivaji Inquiry: ప్రముఖ నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటీమణుల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలం, పరోక్షంగా వారిని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందిస్తూ శివాజీ తీరును తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. యాంకర్ అనసూయ కూడా స్పందించారు. దీనికి యాంకర్ ఝాన్సీ కూడా మద్ధతు పలుకుతున్నారు. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. శివాజీ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయినా మహిళా కమీషన్ కూడా విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీనికి సమ్మతించిన శివాజీ తాజాగా మహిళా కమీషన్ ముందు హాజరయ్యారు. అనంతరం మహిళా కమీషన్ శివాజీ కి కొన్ని ప్రశ్నలు సంధించింది, అవి ఏంటంటే?

Read also-Highest Grossing Movies: 2025లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాలు ఇవే..

సుమారు 2 గంటలపాటు శివాజీని విచారించిన కమిషన్ సంధించిన ప్రశ్నలు ఇక్కడ చూడవచ్చు మరి వాటికి శివాజీ ఎటువంటి సమాధానం ఇచ్చారు అన్నది తెలియాల్సి ఉంది.

1. మహిళల పై మీరు చేసిన వాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం మీద ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తుంది. మీరేమంటారు?

2. సినిమా నటుడిగా మీ వాఖ్యలు సమాజం పై ప్రభావం చూపుతాయి. ఇది మీకు తెలిసే ఇలాంటి వాఖ్యలు చేసారని కమిషన్ భావిస్తుంది

3. మహిళల వస్త్రాధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా?

4. మీ వాఖ్యలు మహిళలను కించపరిచనట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి

5. మీ వాఖ్యలు మహిళల పై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. వీటికి మీ సమాధానం?

Just In

01

Kalaga Kathaga: ‘ఛాంపియన్’ నుంచి మనసును మీటే మెలోడీ ‘కలగా కథగా’ లిరికల్ వీడియో వచ్చేసింది..

Journalists Protest: సంగారెడ్డి కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా… ఎందుకంటే?

Ponguleti Srinivasa Reddy: అవినీతి లేని పాలనే లక్ష్యం.. అభివృద్ధిలో దూసుకుపోతాం.. మంత్రి పొంగులేటి

Shambala Movie: హిందీ డబ్బింగ్‌కు సిద్ధమవుతున్న ఆది ‘శంబాల’.. అక్కడ రిలీజ్ ఎప్పుడంటే?

Delhi Murder Suicide: దేశంలో మరో ఘోరం.. సిగరేట్‌కు రూ.20 ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త