Ugandhar Muni: వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. ప్రీమియర్లతో మొదలై.. పాజిటివ్ టాక్‌తో డే వన్ అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుండటంతో దర్శకుడు యుగంధర్ ముని మీడియాకు తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సైన్స్‌కి, శాస్త్రానికి మధ్య బాలెన్స్ చేస్తూ..
‘‘మూడేళ్ల క్రితం ‘శంబాల’ పాయింట్ అనుకున్నాను. నాకు నిర్మాత రాజశేఖర్‌తో ఐదేళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ పాయింట్‌ను ముందు ఆయనకు చెప్పాను. ఆ కథ ఆయనకు చాలా నచ్చింది. ఆ తర్వాత మరో నిర్మాత మహిధర్ కూడా యాడ్ అయ్యారు. అలా మా ఈ జర్నీ మొదలైంది. దర్శకుడిగా ఈ కథను ఎంతో బాధ్యతతో, చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. నేను చెప్పే కథను చాలా మంది చూస్తారు. తద్వారా ఎంతో నేర్చుకుంటారు. ఏ ఒక్కరినీ బాధ పెట్టకూడదు. ముఖ్యంగా సైన్స్‌కి, శాస్త్రానికి మధ్య బాలెన్స్ చేయాలని, ఎవరి మనోభావాలను దెబ్బ తీయకూడదని ముందే అనుకున్నాను. అలా అన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేశాను.
Also Read- Shekar Basha: కిలిమంజారో.. తోపు పాయింట్ లాగి, చిన్మయికి షాకిచ్చిన శేఖర్ బాషా!
కాల్ చేసి అభినందిస్తున్నారు
‘శంబాల’కు వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. హౌస్ ఫుల్ బోర్డులు పడినా కూడా గేట్లు తన్నుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ నేను నా చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు చూశాను. ఇప్పుడు ఇలా నా మూవీకి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన రావడం చూసి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. తమిళనాడు, కర్ణాటకలోనూ మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. అలాగే ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్ చేశారు. హీరోలు, దర్శక, నిర్మాతలందరూ కాల్ చేసి అభినందిస్తున్నారు. ఆది ఈ మూవీ విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ఇలాంటి ఓ సక్సెస్ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతూనే వచ్చారు. సెట్లో ఎన్ని గాయాలైనా కూడా ఆయన లెక్క చేయకుండా వర్క్ చేశారు. ఆది స్క్రిప్ట్‌లో ఎక్కువగా ఇన్ పుట్స్ ఇవ్వలేదు. కథా చర్చల టైమ్‌లో ఆది కొన్ని సలహాలు ఇచ్చారు. ఒక్కసారి స్క్రిప్ట్ లాకైన తర్వాత మళ్లీ ఛేంజెస్ చెప్పలేదు. ఆయన చెప్పినట్టుగా నటించుకుంటూ వెళ్లారు.
Also Read- Shambhala: ఆది కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘శంబాల’.. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ వదిలారు
చాలా రీసెర్చ్ చేశా
‘శంబాల’ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ఉల్క పడిన ప్రాంతం ఎలా ఉంటుంది? అనే విషయంలో చాలా రీసెర్చ్ చేశాను. ఉల్క పడితే ఏం జరుగుతుంది? ఉల్క పడిన చుట్టూ ప్రాంతం ఎలా ఉంటుంది? అని బ్రెజిల్లో జరిగిన ఘటనల మీద పరిశోధన చేశాం. ప్రాణవాయువు అని మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఆక్సిజన్ అని కొన్నేళ్ల క్రితం కనిపెట్టాం. రావి, తులసి, వేప వంటి చెట్ల నుంచి ప్రాణ వాయువు వస్తుందని మన పురాణాలు చెబుతాయి. అందుకే ప్రతీ ఇంట్లో వాటిని పెంచుకునేవారు. ఇప్పుడు సైన్స్ అని చెబుతాం. కానీ మనకు ఇవన్నీ ఎప్పటి నుంచో మన కల్చర్‌లోనే ఉన్నాయి. ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాలకి నా స్క్రిప్ట్ ముందే చెప్పాను. నాకు ఎలా కనిపించాలి? నా విజన్ ఏంటి? అని ఇలా అన్నీ ముందుగానే క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులంతా ఎంతో సపోర్ట్ చేశారు. వారి సహకారంతోనే ఇంత గొప్పగా సినిమాని తీయగలిగాము. అనుకున్నదానికంటే ఓ పది శాతం బడ్జెట్ ఎక్కువైంది. నిర్మాతలు నాకు ఈ విషయంలో చాలా అండగా నిలబడ్డారు. నాకు సూపర్ నేచురల్, థ్రిల్లర్ జానర్లంటే చాలా ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం నేను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లోనే మరో సినిమా చేయబోతున్నాను. ఇంకా కథ ఫైనల్ కాలేదు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

