Naga Vamsi: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. తన బ్యానర్ నుండి వచ్చే సినిమాలే కాకుండా, ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్లు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలు, త్రివిక్రమ్ గారి వ్యక్తిత్వం మరియు తన సినిమా ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నాగవంశీ గారు తన మాట తీరుపై వస్తున్న విమర్శలకు సూటిగా సమాధానమిచ్చారు. తాను ఏదైనా విషయం గురించి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడటం వల్ల సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్‌కు గురవుతుంటానని ఆయన అంగీకరించారు. అయితే, ఆ స్పందనలు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం సినిమాలపై తనకున్న అమితమైన ఎమోషన్ వల్లే అలా రియాక్ట్ అవుతానని స్పష్టం చేశారు. “సినిమా అంటే మాకు ఒక బిడ్డ లాంటిది. ఎంతో కష్టపడి నిర్మించిన సినిమా గురించి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు బాధ కలుగుతుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోతే సినిమాలపై బాధ్యత ఉండదు,” అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో కొన్ని విషయాల్లో తాను ఆవేశంగా స్పందించి ఉండవచ్చని, కానీ అదంతా సినిమా పట్ల ఉన్న పట్టుదల వల్లే జరిగిందని ఆయన వివరించారు.
Read also-Allu Arjun: అల్లు అర్జున్ ఈ లైనప్ చూస్తే ప్యాన్స్ ఫ్యాన్స్‌కు పండగే.. గ్లోబల్ రేంజ్ ర్యాంపేజ్..
త్రివిక్రమ్ ప్రశాంతత రహస్యం ఇదేనా?
ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నాగవంశీ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, విమర్శలు తనను ప్రభావితం చేస్తున్న తరుణంలో త్రివిక్రమ్ గారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారని తెలిపారు. దానికి ప్రధాన కారణం ఆయనకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ (Instagram, Twitter) లేకపోవడమే! త్రివిక్రమ్ గారు ఎలాంటి యాప్స్‌లో లేరని, అందుకే ఆయన బాహ్య ప్రపంచపు విమర్శలకు దూరంగా ఉంటూ తన పనిపై దృష్టి పెట్టగలుగుతున్నారని వంశీ పేర్కొన్నారు. ఒక్కోసారి తానూ కూడా ఆ ప్రశాంతతను అలవరచుకోవాలని ప్రయత్నిస్తుంటానని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
Read also-Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?
2025 పాఠాలు
2025లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిస్ ఫైర్ అయ్యాయని, అవి తనకు మంచి పాఠాలను నేర్పాయని నాగవంశీ తెలిపారు. సంక్రాంతికి రాబోతున్న నవీన్ పోలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’ విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సినిమా క్వాలిటీ కంట్రోల్ బాధ్యతను త్రివిక్రమ్ గారే స్వయంగా చూశారని, ఈసారి ప్రేక్షకులకు 100% వినోదాన్ని అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఫల్యాలను స్వీకరించడం ఇష్టం లేకపోయినా, అవి నేర్పే పాఠాలు భవిష్యత్తుకు పునాదులని నమ్ముతూ, 2026లో సరికొత్త ఉత్సాహంతో అడుగుపెడుతున్నట్లు నాగవంశీ తన ఇంటర్వ్యూను ముగించారు.

