Shivaji Controversy: దండోరా సినిమా (Dandora Movie) ఈవెంట్‌లో నటుడు శివాజీ (Actor Shivaji) మాట్లాడుతూ, మహిళలు సంప్రదాయ వస్త్రధారణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం (Shivaji Controversy) రేపుతున్న విషయం తెలిసిందే. స్త్రీలను అగౌరవపరిచారంటూ కొందరు విమర్శిస్తుండగా, శివాజీ సత్యం మాట్లాడారంటూ అత్యధికులు సమర్థిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్ నవ్య స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
శివాజీ మాట్లాడినదాంట్లో తప్పులేదని నవ్య సమర్థించారు. ఆడవాళ్ల కట్టుబొట్టు సంప్రదాయం గురించే శివాజీ మాట్లాడారని, హీరోయిన్స్ అందరికీ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే మంచిదని ఆమె సూచించారు. శివాజీ చెప్పిన నాలుగు మాటలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఏం తప్పుందని ఈ విషయాన్ని లాగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ‘‘మా బట్టలు మా ఇష్టం అంటున్నారు, ఇలాంటోళ్లు ఏం నేర్పిస్తున్నారు. వచ్చిరాని మాటలు ఎందుకు?. చెడ్డీలు, సగం గుడ్డలు ఎవరికోసం?. పద్ధతిగా బ్రతికే వాళ్ల పరువు తీస్తున్నారు దరిద్రపు ముం*డలు. ఈ చెత్త మొహాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి. వీళ్ల డ్రెస్ సెన్స్ వల్లనే మగవాళ్లు కామాంధులు అవుతున్నారు’’ అని నవ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా ఎవరి పేరు ఎత్తకుండానే శివాజీని విమర్శించినవారిపై ఆమె మండిపడ్డారు.
Read Also- Gajwel – BRS: పార్టీ ఫండ్ చిచ్చు.. గజ్వేల్ బీఆర్ఎస్‌లో లుకలుకలు!.. ఎక్కడివరకు దారితీసిందంటే?
శివాజీ తప్పు మాట్లాడలేదు
శివాజీ ఏ తప్పూ మాట్లాడలేదని, ఆడవాళ్ల కట్టు, బొట్టు గురించే ఆయన మాట్లాడారని నవ్య ప్రస్తావించారు. గతంలో ఇండస్ట్రీకి చెందినవారు కూడా మంచిగా డ్రెస్సింగ్ వేసుకునేవారని ఆమె గుర్తుచేశారు. హీరోయిన్స్ మంచికోరే శివాజీ మాట్లాడారని ఆమె ప్రస్తావించారు. ఈ విషయాన్ని అనవసరంగా సాగదీస్తున్నారని అన్నారు. భారతీయ సంస్కృతిలో కట్టు,బొట్టు ఉంటాయని ఆమె అన్నారు. శివాజీ ఒక రెండు మాటల విషయంలో క్షమాపణ చెప్పారని, కానీ, ఆ విషయంలో కూడా క్షమాపణ చెప్పాల్సిన పనిలేదని నవ్య వ్యాఖ్యానించారు. విదేశీ సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చి, భారతీయ సంస్కృతిలో కలుపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లనే సమాజం నాశనమవుతోందని అన్నారు. వీళ్ల వల్లే చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంచిగా ఉన్నవాళ్లను కూడా చెడగొడుతున్నారని నవ్య పేర్కొన్నారు. ఇలాంటోళ్ల వల్ల మిగతా మహిళల పరువుపోతోందని అన్నారు.
తెలివి ఉంటే జంతువులు దుస్తులు కట్టుకుంటాయేమో
జీవితంలో ఒక విలువ లేదా? అని పొట్టి దుస్తులను సమర్థించేవారిని మాజీ సర్పంచ్ నవ్య ప్రశ్నించారు. ‘‘భూమ్మీద బతికి కన్నతల్లిదండ్రుల పరువు, కట్టుకున్నోడి పరువు కాపాడాలి. రేపు పిల్లలు, మన తోబుట్టువులు, ఇరుగుపొరుగు ఊరువాళ్లు ఉంటారు. మా ఇష్టం మేము అంటే ఎందుకు ఇక?, కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తినడం లేదు. కాబట్టి, అన్నం తిన్నట్టుగానే బతకాలి. ఇష్టమొచ్చినట్టు బతుకుతాం అంటే పశువులు కూడా ఉంటాయి. పశువులకు, మనుషులకు తేడా లేదా?. పశువులకు ఏం తెలియదు కాబట్టి అవి అట్లా ఉంటున్నాయి. వాటికి తెలివి ఉంటే అవి దుస్తులు కట్టుకుంటాయి కావొచ్చు’’ అని నవ్య వ్యాఖ్యానించారు.
Read Also- Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

