Wife Extramarital affair: నిజామాబాద్‌లో భార్య బాధితుడి ఆందోళన
నిజామాబాద్, స్వేచ్ఛ: ఎన్నో ఆశలతో వివాహ జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి, కేవలం 4 నెలలకే గుండెపగిలే అనుభవం ఎదురైంది. పెళ్లికే ముందే తన భార్యకు శారీరక సంబంధం ఉందని, పెళ్లాయ్యాక కూడా ఆ సంబంధం కొనసాగుతోందని గుర్తించి తీవ్ర ఆవేదనకు (Wife Extramarital affair) కుమిలిపోతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి దిగాడు. ఫెక్సీ వేయించి మరీ భార్య ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగాడు.
వాట్సప్ చాటింగ్ చూసి గుర్తింపు
ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. భార్య బాధితుడిగా మారి ధర్నా చేస్తున్న ఆ వ్యక్తి పేరు ప్రశాంత్. అతడికి నాలుగు నెలల క్రితం అంటే, ఆగస్టు 13న సంయుక్త అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పెళ్లి అయిన నాలుగు నెలల్లోనే గుర్తించానని ప్రశాంత్ ఆరోపణ చేస్తున్నాడు. బావ వరుస అయిన లింబాద్రి అనే వ్యక్తితో తన భార్య సంయుక్తకు వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌ను గుర్తించానని పేర్కొన్నాడు. వాట్సప్ చాటింగ్‌లను స్క్రీన్‌షాట్లు తీశాడు. భార్య మోసం చేసిందంటూ కొంతకాలంగా వాట్సప్‌లో స్టేటస్‌లు పెడుతున్నాడు. ఇక, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక ఫ్లెక్సీ వేయించి, భార్య ప్రియుడు లింబాద్రి ఇంటి ఎదుట ప్రశాంత్ ధర్నాకు బైఠాయించాడు. న్యాయం చేయాలంటూ అతడు ఆందోళన చేపడుతున్నాడు. న్యాయం కోరుతూ, ఫ్లెక్సీ పట్టుకొని బైఠాయించాడు. భార్య సంయుక్త, ఆమె బావ లింబాద్రి ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లు, ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవటం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also- Prabhas RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి మ్యూజికల్ సర్‌ప్రైజ్.. క్రిస్మస్ ట్రీట్ అదిరిందిగా..
ఫ్లెక్సీలో ఏముందంటే?
‘‘నాకు న్యాయం కావాలి. భారతదేశ చట్టాన్ని నమ్ముతాను. ఒక విశ్వకర్మగా, హిందువుగా సనాతన ధర్మాలను, విలువలను నేను పాటిస్తా. అక్రమ సంబంధం నడుపుతూ, నన్ను అబద్ధాలతో మోసం చేసి పెళ్లి చేసుకొని, నా జీవితాన్ని నాశనం చేశారు. మహిళా సంఘాలు రావాలి. ప్రజలు, పెద్దలే న్యాయం చేయాలి. మీడియా మిత్రులు సహకరించండి. నా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి’’ అని ప్రశాంత్ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు.
పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా..
భార్య వివాహేతర సంబంధాన్ని గుర్తించి, వినూత్న రీతిలో భర్త నిరసనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన అతి తక్కువ కాలంలోనే ఆమె ప్రవర్తనలో మార్పు రావడం, చాటింగ్ చేస్తున్నట్టుగా బాధిత భర్త గుర్తించాడు. దీంతో, ప్రియుడు లింబాద్రితో భార్య సంయుక్త జరిపిన వాట్సాప్ చాటింగ్‌లు, ఇతర కీలక ఆధారాలను ప్రశాంత్ సేకరించాడు. ఈ ఆధారాలతో పోలీసులను ఆశ్రయించినప్పటికీ, స్పందన లేకపోవడంతో నేరుగా ధర్నాకు గిదాడు. చట్టపరంగా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు. కేవలం ధర్నా చేయడమే కాకుండా, తన గోడును వెళ్లబోస్తూ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా వాట్సాప్ స్టేటస్‌లు పెట్టిన అతడు, ఇప్పుడు బహిరంగంగా రోడ్డుపైకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

