Sree Vishnu: టాలెంట్ ఉన్న కొత్తవాళ్లకు శ్రీ విష్ణు బంపరాఫర్
Eesha Pre Release Event (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sree Vishnu: టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు నన్ను కలవండి.. అతని నెంబర్ ఇస్తా!

Sree Vishnu: హారర్‌ సినిమాలు ప్రేక్షకులను భయపెడతాయని అందరికీ తెలుసు. కానీ హారర్‌ కాన్సెప్ట్‌తో హారర్ సినిమాకు చేసిన ఈవెంట్‌ కూడా అక్కడికి వచ్చిన వారిని భయపెడుతుందని ‘ఈషా’ (Eesha) సినిమా ఈవెంట్ నిరూపించింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘ఈషా’ హాంటెండ్‌ నైట్‌ ఈవెంట్‌.. అక్కడికి వచ్చిన వారందరినీ భయపెట్టేలా మేకర్స్ ప్లాన్ చేయడం విశేషం. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేయబోతున్నారు. అఖిల్‌ రాజ్‌ (Akhil Raj), త్రిగుణ్‌ (Thrigun) హీరోలుగా.. హెబ్బాపటేల్‌ (Hebah Patel) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వం వహించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ‘ఈషా’ హాంటెండ్‌ నైట్‌ పేరుతో మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ శ్రీవిష్ణు (Sree Vishnu) బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేసి, ప్రేక్షకుని అంగీకార పత్రంపై సైన్‌ చేశారు.

Also Read- Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

నావెల్టీతో పాటు మంచి ట్విస్టులు

ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. హారర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలిసి హారర్‌ సినిమాలు థియేటర్‌లో చూసి థ్రిల్ల్‌ ఫీలవుతాను. హారర్‌ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ చాలా రోజుల వరకు గుర్తుండిపోతుంది. ఈ ‘ఈషా’ సినిమా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా చాలా రోజులు అందరిని వెంటాడుతుందని నాకు అనిపిస్తోంది. సో.. అందరూ ఈ సినిమా చూసి ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందాలని కోరుతున్నాను. దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె కథల్లో ఒక నావెల్టీ ఉంటుంది. ఆయన కలిసిన ప్రతిసారి చాలా కథలు చెబుతుండేవాడు. ఈ కథ కూడా తప్పనిసరిగా నావెల్టీతో పాటు సినిమాలో మంచి ట్విస్టులు ఉండబోతున్నాయి. ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన నటీనటులందరికీ మంచి విజయం వస్తుందని ఆశిస్తున్నాను. మంచి అభిరుచి ఉన్న దామోదర ప్రసాద్‌ సమర్పకుడిగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలో అంచనాలు ఉన్నాయి.

Also Read- Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

వాటర్ తాగకుండా సినిమాకు వెళ్లండి

ఇక బన్నీవాసు, వంశీ నందిపాటి మంచి టాలెంట్‌ ఉన్న టీమ్‌తో వాళ్ల ప్లానింగ్‌తో సపోర్ట్‌ చేస్తున్నారు. నెలకో కొత్త టీమ్‌ను వాళ్లు పట్టుకుని పైకి తీసుకువస్తున్నారు. అందుకే వారు పిలవగానే, వారి ఈవెంట్ ఏదైనా నేను వచ్చేస్తాను. వాళ్లు కొత్త వాళ్లను ఎంతో ఎంకరైజ్‌ చేస్తున్నారు. ఇందులో నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. కొత్తగా సినిమాల్లోకి వద్దామనుకునే వాళ్లు, కొత్తగా సినిమాలు తీద్దామనుకునే వాళ్లు, బ్యాక్‌గ్రౌండ్ లేదని ఏం భయపడకండి. వంశీ అడ్రస్, డిటైల్స్ నేను ఇచ్చేస్తాను. మీరు ఆయనకు సినిమాలు చూపించొచ్చు. వారికి నచ్చిందంటే మాత్రం మీ సినిమాను, మిమ్మల్ని మరో స్థాయికి తీసుకవెళతారు. ఈ సినిమాతో వాళ్లు మరో విజయం అందుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈ సినిమాను చూడడానికి వచ్చే వాళ్లకి ఒక రిక్వెస్ట్.. అసలే చలికాలం, వాటర్ తాగకుండా రండి. అదే మంచిది’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

Vivek Venkatswamy: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి!

Anasuya: అతనిది చేతగానితనం.. శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్