Sammakka Saralamma Temple: వన దేవతలు సమ్మక్క, సారలమ్మ కొలువుదీరిన మేడారం రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy), సీతక్(Seethakka)క పరిశీలించారు. ముందుగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తర్వాత మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒక యజ్ఞం చేస్తున్నారని అన్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలిపేలా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. 90 రోజుల్లో పని పూర్తి చేయాలనుకున్నామని, ఆలయ రాతి శిలల మీద ఆదివాసీ గొట్టు, గోత్రాలు, జీవన శైలి శిల్పాలు ఉంటాయని వివరించారు. మేడారంలో విశాలమైన రోడ్లను సిద్ధం చేశామని, జాతర అద్భుతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆదివాసీ విశ్వాసాలకు తగ్గట్లుగా ఆలయం రూపుదిద్దుకుంటున్నదని అన్నారు.
Also Read: MP DK Aruna: పదేళ్లు తండ్రి చాటు ఉండి.. ఇప్పుడు నీతి వాక్యాలా?: ఎంపీ డీకే అరుణ
పక్క రాష్ట్రాల అధికారుల సహాయం
పొంగులేటి మాట్లాడుతూ, కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క సారలమ్మ ఆలయ పనులను జనవరి మొదటి వారంలోగా పూర్తి చేస్తామని తెలిపారు. 200 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరని నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా 80 శాతం పనులు పూర్తి చేశామని, భక్తుల దర్శనాలు ఒకవైపు, పనులు మరోవైపు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిపక్ష నేతలతో పాటు అందరినీ మేడారానికి ఆహ్వానిస్తామని, పక్క రాష్ట్రాల అధికారుల సహాయం కూడా తీసుకొని రాత్రింబవళ్ళు రాతి నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని వివరించారు. కొత్త సంవత్సరంలో జాతరకు వచ్చే వారికి కొత్త అనుభూతి కలుగుతుందని తెలిపారు.
దర్శనాలకు బ్రేక్..
ఇవాళ మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనాలు నిలిపివేస్తున్నట్టు పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు తెలిపారు. గోవింద రాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటు విస్తరణ పనుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజా వ్యవహారాల నేపథ్యంలో భక్తుల దర్శనాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు చెప్పారు.
Also Read: Oppo Reno 15 Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లోకి రానున్న Oppo Reno 15 Series 5G

