PAN Aadhaar: ఆధార్‌తో పాన్ లింక్ చేయాల్సిందేనా?
aadhar ( Image Source: Twitter)
Telangana News

PAN Aadhaar: డిసెంబర్ 31 గడువు.. ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుందా.. ?

PAN Aadhaar: ఆధార్‌తో పాన్ లింక్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు ముగియబోతోంది. ఇంకా వారం మాత్రమే ఉంది. ఇప్పటికీ PAN–Aadhaar లింక్ చేయని వారు ముందుగా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. ఎందుకంటే గడువు మిస్ అయితే పాన్ కార్డు పనిచేయకుండా పోయే అవకాశం ఉంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ప్రకటన ప్రకారం, PAN–Aadhaar లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025. ఈ గడువు లోపు లింక్ చేయని వారి PAN కార్డులు జనవరి 1, 2026 నుంచి ఇనాపరేటివ్ (Inoperative) అవుతాయి.

ఆధార్‌తో పాన్ లింక్ చేయాల్సిందేనా?

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ 2025 ఏప్రిల్ 3న విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం,

అక్టోబర్ 1, 2024కి ముందు ఆధార్ ఆధారంగా పాన్ పొందిన వారు తప్పనిసరిగా డిసెంబర్ 31, 2025లోపు లింక్ చేయాలి.

మిగతా వ్యక్తులకు PAN–Aadhaar లింక్ చేసేందుకు గడువు మే 31, 2024తోనే ముగిసింది. ఆ తేదీ లోపు లింక్ చేయకపోతే ఇప్పటికే వారి PAN ఇనాపరేటివ్‌గా మారే అవకాశం ఉంది.

PAN ఇనాపరేటివ్ అయితే వచ్చే సమస్యలు చాలా తీవ్రమైనవిగా ఉంటాయని ట్యాక్స్ శాఖ హెచ్చరిస్తోంది.

PAN–Aadhaar లింక్ చేయకపోతే ఏమవుతుంది?

మీ PAN కార్డు ఇనాపరేటివ్‌గా మారితే ఎదురయ్యే సమస్యలు ఇవే..

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయలేరు, ఫైల్ చేసినా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది

TDS / TCS ఎక్కువగా కట్ అవుతుంది, ఫారమ్ 26ASలో క్రెడిట్ కనిపించదు

TDS/TCS సర్టిఫికెట్లు అందుబాటులో ఉండవు

బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేరు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు పొందలేరు

బ్యాంక్‌లో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేయలేరు

రూ.10,000కు మించిన బ్యాంక్ లావాదేవీలు చేయలేరు

KYC సమస్యల కారణంగా అనేక సేవలు నిలిచిపోతాయి

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ ఖాతాలు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది

AN–Aadhaar ఆన్‌లైన్‌లో ఎలా లింక్ చేయాలి?

PAN–Aadhaar లింకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. విధానం ఇలా

స్టెప్ 1: ముందుగా మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చెల్లించకపోతే రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఇందుకోసం Income Tax e-Filing పోర్టల్‌కి వెళ్లాలి.

స్టెప్ 2: హోమ్ పేజీలో ఉన్న Quick Links సెక్షన్‌లో Link Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీ PAN నంబర్, ఆధార్ నంబర్, ఆధార్‌లో ఉన్న పేరును ఎంటర్ చేసి Validate చేయండి.

స్టెప్ 4: ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి రూ.1,000 ఫీజు చెల్లించండి.

స్టెప్ 5: చెల్లింపు పూర్తయ్యాక కొన్ని రోజులు ఆగి మళ్లీ e-Filing పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 6: మళ్లీ Link Aadhaar ఆప్షన్‌కి వెళ్లి వివరాలు ఎంటర్ చేయండి.

స్టెప్ 7: “Your payment details are verified” అనే మెసేజ్ కనిపిస్తే Continue పై క్లిక్ చేయండి.

స్టెప్ 8: ఆధార్‌లో ఉన్న పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, అన్ని వివరాలు సరిచూసుకుని అంగీకరించండి.

స్టెప్ 9: చివరిగా వచ్చిన 6 అంకెల OTPని ఎంటర్ చేసి Validate చేస్తే మీ PAN–Aadhaar లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.

Just In

01

CM Revanth Reddy: ‘కేటీఆర్.. నువ్వెంతా? నీ స్థాయి ఎంత?’.. సీఎం రేవంత్ వైల్డ్ ఫైర్!

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!