CM Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కొట్టాలని ఆదేశం..!
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: మంత్రులకు బిగ్ టాస్క్.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కొట్టాలని సీఎం ఆదేశం..!

CM Revanth Reddy: సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రౌండ్ లెవల్ లో మరింత ఫోకస్ పెంచింది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. 90 శాతానికి పైగా సీట్లు గెలవాలని స్ట్రాటజీ తో ముందుకు సాగుతున్నది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి ఆశీంచిన స్థాయిలో ఫలితాలు రానందున.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో తన సత్తా చాటాలని కాంగ్రెస్(Congress) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నది. దీనిలో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఖర్చు బాధ్యతలు మంత్రులకు ఇచ్చినట్లు తెలుస్తోన్నది. కచ్చితంగా అభ్యర్ధులను గెలిపించే బాధ్యతలను సీఎం మంత్రులకు ఇచ్చినట్లు సమాచారం. పైగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులు పార్టీ గుర్తుతో పోటీ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీచినప్పటికీ, కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు , ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది.

అందరి ఫోకస్ వీటిపైనే.. 

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైనే ఉంది. ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ మద్దతు దారులు కైవసం చేసుకున్నా.. తొలుత పెట్టుకున్న టార్గెట్ చేరుకోలేదని అసంతృప్తి పార్టీలో ఉన్నది. దీంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Rvanth Reddy) స్వయంగా రంగంలోకి దిగి, మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలను అప్పగించారు. ప్రతి మంత్రి తనకి కేటాయించిన జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం వరకు మంత్రులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేగాక టికెట్ల కేటాయింపులో అసమ్మతి రాకుండా స్థానిక నాయకులను బుజ్జగించే బాధ్యత కూడా మంత్రులకే అప్పగించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయంలో ప్రభుత్వం, పార్టీ కొంత మేర వెసులుబాటు కల్పించినా, క్షేత్రస్థాయిలో ఖర్చుల బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు,మంత్రులు పర్యవేక్షించనున్నారు.

Also Read: Chinmayi Shivaji: నటుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం.. ‘ఆ నీతి సూత్రాలు మాకెందుకు?’

పార్టీకి రెఫరెండమే..? 

రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు స్థానిక సంస్థలు రెఫరెండంగానే ఉండనున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపినప్పటికీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలనే పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ సింబల్ తో అభ్యర్ధులు పోటీ చేయాల్సి ఉన్నందున సీఎం కూడా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే సీఎం ప్రచారానికీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోన్నది. మెజార్టీ జెడ్పీ చైర్మన్లు కైవసం చేసుకోవడం వలన జిల్లాల్లో పార్టీకి మరింత పట్టు సాధించవచ్చనే అభిప్రాయంలో కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ ఎన్నికలు కంటే ఎంపీటీసీ, జెడ్పీడీసీలను మరింత సవాల్ గా పార్టీ తీసుకోవడం గమనార్​హం.

Also Read: Telugu Boxoffice: 2025లో ఎక్కువ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా?

Just In

01

Attempted Murder: నా తమ్ముడిని చంపిందన్న కసితో.. బండరాయి తీసుకుని మరదలిపై బావ దాడి..?

UP Man: యూపీలో సంచలనం.. కుక్కలా మారిన యువకుడు.. కనిపించిన వారిపై దాడి

Personal Loan: పర్సనల్ లోన్ డీఫాల్ట్ తర్వాత కోర్టు నోటీసులు రాకుండా ఉండాలంటే ఇవి పాటించండి

Demon Pavan: అక్కడ లవ్ ఎమోషన్ ఆర్గానిక్‌గా వచ్చిందే.. డెమోన్ పవన్

Naresh IndiGo: ఇండిగో తీరుపై నటుడు నరేష్ ఆగ్రహం.. పశువుల్లా కుక్కుతున్నారంటూ ఫైర్..