Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్
Nerella Sharada and Sivaji (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Actor Sivaji: హీరోయిన్ల వస్త్రధారణపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ (Actor Sivaji) పై మహిళా కమిషన్​ సీరియస్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్​ పై వాడకూడని పదాలు వాడుతూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై చిత్ర పరిశ్రమలోని పలువురి నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాగా, శివాజీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి దృష్టికి రావటంతో మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. దీనిపై కమిషన్​ ఛైర్మన్​ నేరెళ్ల శారద (Mahila Commission Chairman Nerella Sharada) మాట్లాడుతూ.. శివాజీ చేసిన వ్యాఖ్యలను తమ లీగల్ టీం పరిశీలించినట్టు చెప్పారు. దీనిపై యాక్షన్​ తీసుకుంటామన్నారు. ఎప్పుడైనా సరే.. మాట్లాడే సమయంలో నటులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు రావటంతో శివాజీ బేషరతుగా క్షమాపణలు కోరుతూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అభ్యంతరకర పదాలు వాడి ఉండాల్సింది కాదని అన్నారు.

Also Read- Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు

ఈ మేరకు శివాజీ విడుదల చేసిన వీడియోలో.. ‘‘సోమవారం సాయంత్రం ‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dhandoraa Pre Release Event)లో హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడ్డ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని, నాలుగు మంచి మాటలు చెప్పాలని.. చెప్తూనే, రెండు అసభ్యకర పదాలను మాట్లాడటం జరిగింది. కచ్చితంగా ఆ పదాలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు.. హీరోయిన్లు బయటికి వెళ్లినప్పుడు వేసుకున్న దుస్తులు మంచిగా ఉంటే, మీకు ఇబ్బంది ఉండదమ్మా.. అనే ఉద్దేశం తప్ప, నేను ఎవరినీ అవమాన పరచాలని కాదు. కానీ, ఏది ఏమైనా రెండు అసభ్యకర పదాలు నా నోటి నుంచి వచ్చాయి. దానికి నేను సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నాను.

Also Read- The Rise Of Ashoka: ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి వచ్చిన రొమాంటిక్ మెలోడీ ఎలా ఉందంటే?

ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే

నేను ఎప్పుడూ స్త్రీని ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలానే చూస్తాను. ఎందుకంటే, నేటి సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వవద్దు అని చెప్పే ఉద్దేశంలో.. ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అది నాకు తెలుసు. నా ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ, ఒకటి మాత్రం చెబుతున్నాను. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలని కానీ, కించపరచాలనే ఉద్దేశం కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలెవరైనా దీనిని తప్పుగా అనుకుని ఉంటే.. వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!