Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో రాబోతున్న పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ అని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త (Samyuktha), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 2026, జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేసి సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే..
Also Read- Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్.. బాబోయ్ అరాచకమే!
ఎక్స్, ప్రజంట్ లవర్స్ మధ్య ఇరుక్కున్న ప్రియుడిగా..
ఈ కథ మొత్తం శర్వానంద్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. సాక్షి వైద్యతో ప్రేమలో పడిన శర్వానంద్, తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని వారి వివాహానికి ఆమోదించమని ఒప్పిస్తాడు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో, అతని మాజీ ప్రియురాలు సంయుక్త అకస్మాత్తుగా అదే ఆఫీస్‌లోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత జరిగే హ్యుమరస్ సంఘటనలు, ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న శర్వా పాత్ర, వినోదాత్మక కథనం ఆకట్టుకుంటూ.. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ రాబోతుందనే ఫీల్‌ని ఇస్తున్నాయి. బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ తర్వాత, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టీజర్ టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు హ్యుమర్‌తో నిండి, ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది.
Also Read- Drishyam 3: మళ్ళీ వస్తున్న విజయ్ సల్గాంకర్.. ‘దృశ్యం 3’ అధికారిక ప్రకటన వచ్చేసింది
కామిక్ టైమింగ్ అదుర్స్
శర్వానంద్ పాస్ట్ – ప్రెజెంట్ లవ్ మధ్య ఇరుక్కున్న క్యారెక్టర్‌లో అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో మెప్పించారు. ముఖ్యంగా డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ‘రాజాలా పెంచానురా.. ఇలా రోజా ముందు కూర్చుంటావని అనుకోలేదు’ అంటూ బతుకు జట్కాబండి ఎపిసోడ్‌ని తలపిస్తూ నరేష్ చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. ఇక ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఎనర్జీతో నిండిన లుక్‌లో కనిపిస్తే.. ప్రస్తుత కాలంలో క్లాస్, చార్మ్ లుక్‌తో శర్వా అలరిస్తున్నాడు. ప్రజెంట్ లవ్‌గా సాక్షి వైద్య, మాజీ లవర్‌గా సంయుక్త.. ఇద్దరూ తమ పాత్రలతో శర్వాని ఆడుకున్నట్లుగా అర్థమవుతోంది. సత్య, సునీల్, సుదర్శన్ వంటి సహాయ నటులు హాస్యాన్ని మరింత పెంచుతూ వినోదాన్ని అందించారు. టెక్నికల్‌గానూ ఈ సినిమా హై రేంజ్‌లో ఉంది. మొత్తంగా ఈ టీజర్, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ అనేది ఈ టీజర్ తెలియజేస్తుంది. హాస్యం, భావోద్వేగం, డ్రామా అన్నింటినీ సమపాళ్లలో కలిపిన సినిమా అని ప్రామిస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
అందరూ ఎంజాయ్ చేస్తారు
సి.ఎమ్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగిన టీజర్ లాంచ్ వేడుకలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. మనం అనుకున్నది సాధించే శక్తి మనందరిలో ఉంటుంది. ఎవరి ఒపీనియన్స్‌పై ఆధారపడకండి. ఎందుకంటే మన లైఫ్‌ని మనమే బ్రతకాలి. కష్టపడి చదవండి. భయపడకండి. అనుకున్నది సాధించి హాయిగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే విషయం చెప్తాను. సినిమా పొట్టపగిలి నవ్వేలా వుంటుంది. జనవరి 14న రిలీజ్ అవుతుంది. 5:49 ఫస్ట్ షో… తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి.. అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

