Apni Haddse: ‘అప్నీ హద్ సే’ టైటిల్ సాంగ్ విడుదల..
apna-hathse(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Apni Haddse: ‘అప్నీ హద్ సే’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్..

Apni Haddse: హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌ వేదికగా ‘అప్నీ హద్ సే’ (Apni Haddse) మ్యూజిక్ వీడియో లాంచ్ వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణాదిలో ఉంటూ బాలీవుడ్ స్థాయిలో హిందీ మ్యూజిక్ వీడియోను రూపొందించడం గొప్ప పరిణామమని, యువ ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని పేర్కొంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Read also-Tyler Chase: బెగ్గర్‌గా మారిన హాలీవుడ్ చైల్డ్ యాక్టర్ టైలర్ చేజ్.. ఎందుకంటే?

మహమ్మద్ నజీర్ హీరోగా, రిఫత్ రజూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మెలోడియస్ సాంగ్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘మజిలీ’ చిత్రంలోని ‘ప్రియతమా’ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభయ్ జోధ్‌పుర్కర్ తన గాత్రంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. అత్యున్నత నిర్మాణ విలువలతో, కళ్లకు రిచ్‌గా అనిపించే విజువల్స్‌తో ఈ వీడియో సాంగ్‌ను అత్యంత అందంగా తెరకెక్కించారు. అభయ్ వంటి గొప్ప గాయకుడు తమ పాటను పాడటం గర్వకారణమని హీరో నజీర్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

Read also-Narasimha Re-release: తన ఐకానిక్ పాత్ర నీలాంబరిని చూసి తెగ మురిసిపోతున్న రమ్యకృష్ణ..

హరి తాటిపల్లి దర్శకత్వం వహించడంతో పాటు కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన ఈ మ్యూజిక్ వీడియోకు షారుఖ్ షేక్ సంగీతాన్ని అందించారు. ఉదయ్ శంకర్ సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ ఈ సాంగ్‌కు అదనపు బలాన్ని చేకూర్చాయి. సాంకేతిక హంగులతో రిచ్ క్వాలిటీతో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఈ వేడుకలో పలువురు సినీ రంగ ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొని సందడి చేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నార.

Just In

01

Nirmala Jaggareddy: గాంధీ పేరు తొలగించడం జాతికే అవమానం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!

Pregnant Murder: కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతైన కూతుర్ని చంపేసిన తండ్రి

Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు

UPSC Topper: దేశ సేవే లక్ష్యం.. గూగుల్ ఉద్యోగం వదిలి IAS టాపర్ గా నిలిచిన యువకుడు

Apple India: బెంగళూరు ఆపిల్ ప్లాంట్‌లో మహిళలకే ప్రాధాన్యం.. దాదాపు 80 శాతం మంది వాళ్లే..!