Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య(Gade Innayya)ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆదివారం వరంగల్(Warangal) జాఫర్‌గఢ్‌లోని ఇల్లు, అన్నాథాశ్రమంపై ఎన్ఐఏ(NIA) అధికారులు దాడులు చేశారు. అక్కడే ఉన్న ఇన్నయ్య ఫోన్లు చెక్ చేశారు. గత కొద్ది రోజులుగా మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఈమధ్య హిడ్మా ఊరు పువర్తికి మీడియాతో పాటు వెళ్లారనే సమాచారంతో ఎన్ఐఏ ఈ చర్యలు తీసుకున్నది.
ఉపా చట్టం కింద కేసులు
మావోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు యూఏపీఏ చట్టం కింద ఇన్నయ్యపై కేసులు నమోదు చేశారు. ఇంటిలో సోదాల అనంతరం అరెస్ట్ చేశారు. వరంగల్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నాంపల్లి ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Also Read: Telangana Panchayats: గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన సమస్యలు.. భారంగా పల్లె పనులు
పౌర హక్కుల సంఘం ఖండన
తెలంగాణవాది, భారత్ బచావో నాయకుడు ప్రజాస్వామిక గొంతుకైన గాదె ఇన్నయ్య భావవ్యక్తీకరణను అణచివేసే దురుద్దేశంతో ఎన్ఐఏ, పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పౌర హక్కుల సంఘం మండిపడింది. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
Also Read: Kiara Advani: ‘టాక్సిక్’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

