Kiara Advani: 2026లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) హీరోగా నటిస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic: A Fairytale for Grown-Ups) కూడా ఒకటి. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందనేలా వార్తలు కొందరు వ్యాపింపజేశారు. అలా వార్తలు వైరల్ అయినప్పటి నుంచి సినిమా టీమ్ యాక్టివేటైంది. అప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్‌ను మేకర్స్ వదులుతూనే ఉన్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నదియా పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేసి, మరింత ఊపును ఇచ్చారు. ఎందుకంటే కియారా అద్వానీ ఫస్ట్ లుక్ అలా ఉంది మరి.
Also Read- Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!
నదియా పాత్రలో కియారా..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సౌత్ ప్రేక్షకులకు పరిచయమే. ముఖ్యంగా ఆమె తెలుగులో మూడు భారీ సినిమాలు చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో అందరికీ మరోసారి ఆమె పరిచయం కాబోతోంది. ఎమోషనల్, హై వోల్టేజ్ కమర్షియల్ మూవీస్ సెలక్ట్ చేసుకుంటూ.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తోన్న శక్తివంతమైన ప్రపంచంలోకి నదియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్రఫీ రేంజ్‌ని మరింత పెంచేలా సరికొత్తగా ఉంటుందని టీమ్ చెబుతోంది. నదియాగా కియారా అద్వానీ పస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది.
Also Read- Shambhala: నేచురల్ స్టార్ వదిలిన ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్.. ఎలా ఉందంటే?
డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో
ఈ పోస్టర్‌ను గమనిస్తే.. కలర్‌ఫుల్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తోంది. కియారా అందరి కంటే ముందు నిలబడి గ్లామర్ ఒలకబోస్తోంది. ఆమె పాత్రలో లోతైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఈ హంగామా వెనుక బాధ, విషాదం ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆమె పాత్ర పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చేలా కనిపిస్తోంది. లుక్ చూస్తుంటే ఇదేదో సాధారణమైన పాత్ర కాదని, ఆమె కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉందనిపిస్తోంది. ఏదో స్టేజ్ షోలో ఆమె పెర్ఫామ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నదియా పాత్ర చేస్తున్న కియారా అద్వానీ గురించి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు.. యాక్టర్‌కు సరికొత్త గుర్తింపును తీసుకొచ్చేలా ఉంటాయి. నదియా పాత్రలో కియారా చేసిన నటన డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపిస్తూ అందరినీ అలరిస్తుంది. ఆమె పెర్ఫామెన్స్ చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రయాణంలో నాపై, నా టీమ్‌పై నమ్మకం పెట్టుకుని, మనస్ఫూర్తిగా ఆమె సపోర్ట్ చేసిన తీరుకి టీమ్ తరపున ధన్యావాదాలు చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

