Tapping Raids The Aforementioned Independence Investigation Team
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Phone Tapping : ట్యాపింగ్ రెయిడ్స్, ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం

  •  చిక్కుల్లో ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ రావు
  •  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సోదాలు
  •  ప్రణీత్ రావుతో డీలింగ్స్ పై పోలీసుల ఆరా
  •  జూబ్లీహిల్స్ లోని ఇంట్లో తనిఖీలు
  •  లండన్ పారిపోయినట్టు అనుమానం
  •  ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు పరార్‌!

Tapping Raids, The Aforementioned ‘Independence’ Investigation Team : ‘స్వేచ్ఛ’ చెప్పిందే నిజమైంది. జూబ్లీహిల్స్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ముందే పసిగట్టింది. ఓ ఛానల్ ఓనర్ కథంతా నడిపించినట్టు కథనాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగానే ప్రత్యేక బృందం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఈ క్రమంలోనే ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ రావు పేరు తెరపైకి వచ్చినట్టు సమాచారం.


శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని శ్రవణ్ ఇంటికి సోదాల కోసం వెళ్లారు పోలీసులు. ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఐ న్యూస్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ద్వారా తెలుసుకున్నారు పోలీసులు. సోదాల సమయంలో శ్రవణ్ రావు ఇంట్లో లేరు. లండన్ పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు కూడా అమెరికా చెక్కేసినట్టు భావిస్తున్నారు. అయితే, ఆయన కుమారుడ్ని మాత్రం ప్రత్యేక ఎస్కార్ట్ ద్వారా ఇంటికి తీసుకొచ్చారు.

– దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్‌)


Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!