Christmas Celebrations: మతాలను కించపరిస్తే శిక్ష తప్పదు
Christmas Celebrations (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Christmas Celebrations: ఇతర మతాలను కించపరిస్తే చట్టపరంగా శిక్ష తప్పదు: సీఎం రేవంత్ రెడ్డి

Christmas Celebrations: ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా శాసన సభలో చట్టం తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించేలా చట్టాన్ని సవరిస్తామన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామన్నారు. మైనారిటీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదు. అది వారి హక్కుగా వివరించారు. క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. శనివారం ఆయన ఎల్బీ స్టేడియం లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.

మిరాకిల్ మంత్..

క్రిస్టియన్ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ అని వెల్లడించారు. డిసెంబర్ నెల క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్ అని కొనియాడారు. కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టింది డిసెంబర్ నెలలోనేనని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా డిసెంబర్ నెలనే అని వివరించారు.ప్రభువు బోధనల స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు.50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపమన్నారు.

Also Read: Vrushabha Trailer: కింగ్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ఇరగదీశాడు.. ‘వృషభ’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?

క్రిస్టియన్ మిషనరీలు

ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని గుర్తు చేశారు.పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. రుణమాఫీ చేసి సన్న వడ్లకు 500 బోనస్ అందించి వ్యవసాయాన్ని పండగ చేశామన్నారు.పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుని పేదలకు అందించాయని పేర్కొన్నారు.ఒక యుద్ధంలా, యజ్ఞంలా అంకితభావంతో ప్రభుత్వంతో పోటీ పడి పేదలకు విద్య, వైద్యాన్ని అందించాయన్నారు.ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసినవారిని, అలాంటి ఘటనలను ప్రభుత్వం అణచివేసిందన్నారు.

Also Read: TG MHSRB Results: 40 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఫలితాలు విడుదల

Just In

01

Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

Harish Rao: రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: హరీష్ రావు

Medaram Jatara: మహిళలకు గుడ్ న్యూస్.. మేడారం జాతరకు ఫ్రీ బస్సు..!

Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి

Kishan Reddy: స్పీకర్ ఏ రకంగా తీర్పు ఇస్తున్నారో అర్థం కావట్లేదు?: కిషన్ రెడ్డి