At Home
తెలంగాణ, హైదరాబాద్

రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్

తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ (At Home) కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, హై కోర్టు చీఫ్ జస్టిస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించిన గవర్నర్… వారికి అవార్డులు ప్రదానం చేశారు.

ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంఎల్ఏ, ఎంపీలు హాజరయ్యారు. బీజేపీ తరపున ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పద్మ శ్రీ మందకృష్ణ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, టీజిపిఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ప్రముఖులు హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ నేతలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

గవర్నర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీతలు 

పర్యావరణ కార్యకర్త అనిల్ కుమార్,

పద్మశ్రీ అవార్డు గ్రహీత, న్యాయవాది డాక్టర్. పి. హనుమంత రావు,

పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ లెజెండ్, కోచ్ డా. పుల్లెల గోపిచంద్,

పద్మశ్రీ అవార్డు గ్రహీత, కూచిపూడి నృత్య నిపుణులు డాక్టర్ పద్మజా రెడ్డి

దుశర్ల సత్యనారాయణ( పర్యావరణ పరిరక్షణ),

అరికపూడి రఘు(దివ్యాంగుల సంక్షేమం),

పారా ఒలింపిక్‌ విజేత జీవాంజి దీప్తి(క్రీడలు),

ప్రొఫెసర్‌ ఎం. పాండురంగా రావు, పి.బి. కృష్ణ భారతికి సంయుక్తంగా(సంస్క్రతి),

సంస్ధల విభాగంలో ధ్రువాంశు ఆర్గనైజేషన్‌(పర్యావరణ పరిరక్షణ),

ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి(దివ్యాంగుల సంక్షేమం),

ఆదిత్య మెహతా ఫౌండేషన్‌(క్రీడలు), సంస్కృతి ఫౌండేషన్ (సంస్కృతి)

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు