Jaggareddy
తెలంగాణ, హైదరాబాద్

Jaggareddy | బండి సంజయ్ క్షమాపణలు చెప్పాల్సిందే -జగ్గారెడ్డి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Ex MLA Jaggareddy) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మాట్లాడుతూ… ఇందిరా గాంధీ చరిత్ర తెలికుండా అగౌరవ పరిచిన బండి సంజయ్ వెంటనే చేసిన తప్పిదాన్ని గుర్తించాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలని హితవు పలికారు. దేశంలో ఏ మారు మూల గ్రామానికి వెళ్లినా ఇందిరా గాంధీ పేరు మీద ఇల్లు లేదా జాగలు ఉంటాయన్నారు. ఇందిరమ్మ వ్యక్తిత్వం కించపరచడం సరికాదన్నారు.

దేశం కోసం నిండు గర్భిణీగా ఉన్నప్పుడే ఆమె జైలుకు వెళ్లిందని జగ్గారెడ్డి (Jaggareddy) గుర్తు చేశారు. రాజీవ్ గాంధీని కూడా జైల్లోనే పెట్టారన్నారు. దేశ నాయకులు గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలన్నారు. తామెప్పుడూ అద్వానీ, వాజ్ పాయ్ ల గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. బీజేపీ పుట్టి కేవలం 40 ఏళ్లు మాత్రమే అయిందని, కానీ కాంగ్రెస్ 140 ఏళ్ల క్రితం నుంచి ఉన్నదనే విషయం బండి గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజకీయాల గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే విచిత్రంగా ఉన్నదన్నారు. పేదలకు న్యాయం చేసేందుకు ‘రోటీ.. కపడా.. మకాన్’ నినాదంతో ముందుకు వెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్లు చరణ్​ కౌశిక్, దుర్గం భాస్కర్, నిజాముద్దీన్ లు పాల్గొన్నారు.

బండి సంజయ్ ఏమన్నారంటే…

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెట్టొద్దని కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. అలా పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వమని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?