Warangal Damodar Raja Narasimha
తెలంగాణ, నార్త్ తెలంగాణ

Warangal | బాధితులకు మెరుగైన వైద్యం అందించండి -దామోదర రాజనర్సింహ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: వరంగల్ (Warangal) జిల్లా మామునూరు రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ప్రమాదంలో పలువురు మరణించడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన… గాయలతో చికిత్స పొందుతున్న బాధితులకు క్వాలిటీ వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

ఇక పేదలను కాపాడటమే మన టార్గెట్ అని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. వైద్య వృత్తి గొప్ప అవకాశమని, దీన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఆయన ఆదివారం సోషల్ మీడియా వేదికగా కోరారు. విధి నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగానికి ఉద్యోగులంతా సపోర్టుగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది స్పూర్తిగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తేనే వృత్తికి న్యాయం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు మరింత స్పీడ్ గా వైద్యం అందించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్నారు. కొత్త ప్లాన్స్ ప్రిపేర్ అవుతున్నాయన్నారు.

కాగా, వరంగల్ (Warangal) జిల్లాలో మామునురు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ తో వరంగల్ కు వెళ్తున్న లారీ.. ప్రయాణికులతో ముందు వెళ్తున్న రెండు ఆటోలను ఢీకొట్టి.. అదుపుతప్పి ఆటోలపై బోల్తా పడింది. ఆటోలపై భారీ ఐరన్ రాడ్లు పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్ సహా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ కు చెందిన ఒకే కుటుంబం వారు. క్షతగాత్రులను పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?