Avatar Fire and Ash: ప్రపంచ సినిమా గమనాన్ని మార్చిన ఇద్దరు అగ్రగామి దర్శకులు ఒకే వేదికపై కలిస్తే ఆ సందడే వేరు. హాలీవుడ్ విజువల్ వండర్ జేమ్స్ కామెరాన్, భారతీయ చలనచిత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎస్‌ఎస్ రాజమౌళి ఇటీవల భేటీ అయ్యారు. రాబోయే చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ గురించి వీరిద్దరి మధ్య జరిగిన చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే సందర్భంలో వారణాసి సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు. సినిమా దాదాపు ఎనిమిది నెలల్లో పూర్తవుతుందని చెప్పారు దీంతో బహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Virat Anushka: విరాట్ కోహ్లీ, అనుష్కలపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రేమానంద్ జీ చెప్పింది ఇదేనా?
ఈ సంభాషణలో రాజమౌళి తన అనుభవాలను పంచుకుంటూ, ‘అవతార్’ మూడవ భాగం చూస్తున్నప్పుడు తాను ఒక ప్రఖ్యాత దర్శకుడిలా కాకుండా, థియేటర్‌లో మంత్రముగ్ధుడైన ఒక చిన్న పిల్లాడిలా మారిపోయానని వ్యాఖ్యానించారు. కామెరాన్ సృష్టించిన ఆ దృశ్యకావ్యం తనను అంతలా ఆకట్టుకుందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మీదనే ఆధారపడకుండా, కథలోని భావోద్వేగాలను (Emotions) ప్రధానంగా ఉంచడం కామెరాన్ గొప్పదనమని రాజమౌళి కొనియాడారు. హైదరాబాద్ ప్రేక్షకులకు ఈ ఫ్రాంచైజీతో ఉన్న విడదీయలేని బంధాన్ని రాజమౌళి గుర్తు చేశారు. గతంలో ‘అవతార్’ మొదటి భాగం హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో దాదాపు ఏడాది పాటు ప్రదర్శించబడిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన రికార్డు అని ఆయన పేర్కొన్నారు. బిగ్ స్క్రీన్ ఇమ్మర్సివ్ అనుభవానికి ‘అవతార్’ ఒక బెంచ్‌మార్క్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
తన కోరిక ఏంటో చెప్పిన కామెరాన్..
భారతీయ సినిమా మేకింగ్ స్టైల్‌ను, ముఖ్యంగా రాజమౌళి విజన్‌ను జేమ్స్ కామెరాన్ మొదటి నుంచీ అభినందిస్తూనే ఉన్నారు. తాజా చర్చలో భాగంగా, వీలైతే రాజమౌళి సినిమా సెట్‌ను స్వయంగా సందర్శించి, ఆయన పనితీరును పరిశీలించాలని ఉందని కామెరాన్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఇద్దరు గ్లోబల్ డైరెక్టర్ల మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. 20th సెంచరీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పండోరా గ్రహంపై మునుపెన్నడూ చూడని కొత్త కోణాలను ఆవిష్కరించనుంది. ఈసారి ‘అగ్ని’ తత్వాన్ని కలిగిన కొత్త తెగలను మనం చూడబోతున్నాం. డిసెంబర్ 19, 2025న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక అనుభూతి అని ఈ ఇద్దరు దర్శకులు మరోసారి నిరూపించారు. ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

