Bigg Boss9 Telugu: బుల్లి తెర ప్రేక్షకులకు దాదాపు పద్నాలుగు వారాలుగా వినోదం అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. 101 రోజు వినోదం మరింత పీక్స్ చేరుకుంది. ఈ రోజు ప్రోమో విడుదలైంది అందులో బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారు చేసిన ఫన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. బిగ్ బాస్ సీజన్ చివరిలో కేవలం అయిదుగురు మాత్రమే ఉండటంతో వారిలో ఒకరు ఫైనల్ కు చేరతారు. ఇదిలా ఉండగా.. ఇందులో ఇమ్మానియేల్ జాతకాలు చెప్పే వ్యక్తిగా మారతాడు.. మిగిలిన నలుగురికి జాతకాలు చెప్పాల్సి రాగా ఒక్కొక్కరినీ పిలిచి ఇమ్మూ చేసిన ఫన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ముందుగా ఇమ్మానియేల్ వద్దకు జాతకం చెప్పించుకోవడానికి సంజనా వెళ్తారు. మీరు యాభై అయిదు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. అంటూ చెప్తాడు.. ఇది నీకెలా తెలుసు అంటూ సంజనా అడగ్గా గొడవ జరిగిన ప్రతి సారీ మీరే చెప్తారు నేను యాభై అయిదు సినిమాల్లో హీరోయిన్ గా చేశాను అని అంటూ చెప్పి అందరినీ నవ్విస్తాడు.

