Champion: ఎప్పుడూ కొత్తదనం నిండిన, ఆకట్టుకునే కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే స్వప్న సినిమాస్ సంస్థ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion). ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ చిత్రం సినీ అభిమానుల్లో బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. డిసెంబర్ 18న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రామ్ చరణ్ బయటకు వచ్చి చాలా కాలం అవుతుంది. అందుకే, ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి
చిరుత ఫర్ ఛాంపియన్
ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ‘చిరుత ఫర్ ఛాంపియన్’ అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’లోని సూపర్ హిట్ సాంగ్ ‘చిరుతొస్తే చిందే వేయ్యాలా’ మ్యూజిక్‌ను ఈ వీడియోలో ఉపయోగించడం, అభిమానులను మరింతగా అలరించి, వారిలో ఉత్సాహాన్ని నింపింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుండడం, ఈ సినిమాకు భారీ మైలేజీని ఇవ్వడం ఖాయం. అందులో డౌటే లేదు. రామ్ చరణ్ అరంగేట్రం వైజయంతీ మూవీస్‌లోనే జరిగింది. నిర్మాత అశ్వనీదత్ ఆయనను పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అశ్వనీదత్ కుమార్తెల స్వప్న సినిమాస్ కోసం రామ్ చరణ్ తన కృతజ్ఞతను చాటుకుంటున్నారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఎంతో ఇష్టమైన శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ ఇందులో హీరో కావడం కూడా చరణ్ రావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ మెగా ఎంట్రీతోనైనా రోషన్ మంచి హిట్ సాధించి యంగ్ హీరోల జాబితాలోకి చేరుతాడేమో చూడాలి.
Also Read- Chikiri Song: సునామీ సృష్టిస్తోన్న ‘చికిరి చికిరి’.. తెలుగులో సరికొత్త రికార్డ్!
ఇప్పటికే పాజిటివ్ వైబ్స్
జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ ‘ఛాంపియన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ నటుడు రోషన్ (Roshan) సరసన అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyan Chakravarthy), అర్చన (Archana) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ‘గిరిగిర’, ‘సల్లంగుండాలే’ చార్ట్ బస్టర్‌గా నిలిచి, సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడేలా చేశాయి. మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ అందించిన అద్భుతమైన ఆల్బమ్ ఈ సినిమా స్థాయిని పెంచింది. ‘ఛాంపియన్’ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ వంటి అగ్ర హీరో ట్రైలర్ లాంచ్‌కు రావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడే అవకాశం ఉంది. ఫ్రెష్ కాస్టింగ్, అద్భుతమైన సాంకేతిక విలువలతో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Chiruthosthey chindhe veyyalaaa…🕺❤️🔥
Mega Power Star @AlwaysRamCharan will be gracing the Trailer Launch Event of #Champion on December 18th.#ChiruthaForChampion pic.twitter.com/ZubzrtKh5X
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 16, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

