Sivaji: విలక్షణ నటుడు శివాజీ (Sivaji) తన సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘దండోరా’ (Dhandoraa) విడుదలకు సిద్ధమైంది. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని (Ravindra Banerjee Muppaneni) ఈ సినిమాను మురళీకాంత్ (MuraliKanth) దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు శివాజీ మీడియాకు చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..
మంచోడా? చెడ్డోడా?
‘‘కోర్ట్ కంటే ముందే ‘దండోరా’ కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అడ్వాన్స్ కూడా ముందే ఇచ్చారు కానీ, ప్రొడక్షన్ పరంగా ఆలస్యమైంది. అందుకే ఈ సినిమా కంటే ముందు ‘కోర్ట్’ రిలీజైంది. ‘దండోరా’ చిత్రంలో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకులకే సరిగా అర్థం కాదు. సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ నా పాత్ర గురించి ఏం చెబుతారో చూడాలని ఉంది. ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను. అయితే ఈ చిత్రంలోని అన్ని పాత్రలు నా చుట్టూనే తిరుగుతాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న చిత్రమిది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఎందుకంటే, ఇందులో ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్రా ఉండదు. అన్ని పాత్రలకు తగిన ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా అని, ఇదేమీ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. గొప్ప స్క్రీన్‌ప్లేతో ఎంతో సహజంగా ఉంటుంది.
Also Read- Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!
మన దర్శకులకు నేను కనిపించడం లేదు
‘కోర్ట్’ సినిమాలో నేను చేసిన మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. అంతే రెస్పాన్స్ ఈ సినిమాలోని పాత్రకి కూడా వస్తుంది. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్ప.. ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర నాకు లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. రీ ఎంట్రీలో నేను దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నాను. మన మేకర్స్ ఎప్పుడూ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మన దగ్గర పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారు. ఇందులో నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన ఆర్టిస్టులున్నారు. అంతా మనవాళ్లే. ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటున్నాం. ఇదే శివాజీ 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఇది వరకు ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించాను. కానీ మన దర్శకులకు నేను కనిపించడం లేదు.
Also Read- Chikiri Song: సునామీ సృష్టిస్తోన్న ‘చికిరి చికిరి’.. తెలుగులో సరికొత్త రికార్డ్!
కాలం కలిసి వచ్చింది
నా కెరీర్‌లో ‘మిస్సమ్మ’, ‘శైలజా కృష్ణమూర్తి’, ‘అదిరిందయ్య చంద్రం’ ఇలా అన్ని రకాల చిత్రాల్ని ఎంజాయ్ చేశాను. కామెడీ, నెగెటివ్ షేడ్స్ ఇలా అన్ని రకాల పాత్రల్ని పోషించాను. ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చిందని అనుకుంటున్నాను. అలా అని అన్నీ ఒకే రకమైన పాత్రల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు. ‘దండోరా’ తర్వాత నా నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. అలాగే ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ కూడా చాలా బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

