Akhanda 2 OTT: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) మూవీ మిశ్రమ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్ర ఓటీటీ విడుదలకు సంబంధించి అప్పుడే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ (Akhanda 2 OTT) హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల విషయంలో నెలకొన్న గందరగోళంతో ఈ మూవీ అనుకున్న డేట్ ప్రకారమే ఓటీటీలోకి వస్తుందనేలా టాక్ నడుస్తుంది. ఆ లెక్కన చూస్తే మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది.
Also Read- Chikiri Song: సునామీ సృష్టిస్తోన్న ‘చికిరి చికిరి’.. తెలుగులో సరికొత్త రికార్డ్!
ఇంత త్వరగానా?
అదెలా అంటే, నాలుగు వారాలకే స్ట్రీమింగ్ అనే కండీషన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ సంస్థ రైట్స్ తీసుకుందని అంటున్నారు. అదీ కూడా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ, ఈ సినిమా ఆ తేదీకి విడుదల కాలేదు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఆ వారం మొత్తం ఈ సినిమాపై ఎలాంటి గందరగోళం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. డిసెంబర్ 12న విడుదలైనప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ సంస్థ మాత్రం డిసెంబర్ 5నే పరిగణనలోకి తీసుకుంటుందని, న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ సినిమాను జనవరి 2వ తేదీన స్ట్రీమింగ్‌కు తెచ్చే అవకాశం ఉందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు నడుస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ కండీషన్స్ ప్రకారమైతే.. జనవరి 2నే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రావాలి. అలా కానీ పక్షంలో జనవరి 9న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అందులో నో డౌట్స్.
Also Read- Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?
జనవరి 2 లేదంటే జనవరి 9
అయితే దీనికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా అనుమతి ఇవ్వాలి. థియేటర్లలో కలెక్షన్స్ బాగుంటే మాత్రం.. ఇంకో వారం పొడిగించే అవకాశం ఉంది లేదంటే మాత్రం జనవరి 2నే స్ట్రీమింగ్‌కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సనాతన హైందవ ధర్మాన్ని హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ రూపుదిద్దుకుంది. ఇందులో బాలయ్య అఘోరాగా, ఎమ్మెల్యేగా రెండు పాత్రల్లో నటించారు. సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా విశ్వరూపం ప్రదర్శించారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫైనల్‌గా ఈ సినిమా న్యూ ఇయర్ స్పెషల్‌గా జనవరి 2, లేదంటే సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

