Chikiri Song: యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ చిత్రం (Peddi Movie) నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri Song) అద్భుతమైన విజయాన్ని సాధించింది. తాజాగా, ఈ పాట కేవలం తెలుగు వెర్షన్‌లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి, సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన సెంచరీతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట ఇప్పటి వరకు సాధించిన మొత్తం వ్యూస్.. ఐదు భాషల్లో కలిపి 150 మిలియన్లు దాటడం విశేషం. ఈ విజయం, ఈ పాటకున్న భారీ ప్రజాదరణకు, సంగీత అభిమానుల్లో ఇది ఎంతగా చొచ్చుకుపోయిందో తెలియజేస్తుంది. ఈ పాట థీమ్, సంగీతం, కొరియోగ్రఫీ ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. విడుదలైన కొద్ది రోజులకే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ రూపంలో ఈ ట్యూన్ నేషనల్ వైడ్ ట్రెండ్‌గా మారింది. లక్షలాది మంది నెటిజన్లు ఈ పాటపై రీల్స్ చేస్తూ, దీనిని నిజమైన ‘సీజన్ యాంథమ్’గా మార్చేశారు.
Also Read- Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?
ఒక్క తెలుగులోనే 100 మిలియన్ల క్లబ్‌లోకి..
చిత్ర యూనిట్ ఈ భారీ స్పందన పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసింది. ‘‘100 మిలియన్ల క్లబ్‌లోకి చికిరి చికిరి.. ఇంతటి అపారమైన ప్రేమకు మేము పొంగిపోతున్నాము. కేవలం తెలుగులోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్, ఐదు భాషల్లో కలిపి 150 మిలియన్లు దాటడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ పాటను సీజన్ యాంథమ్‌గా మార్చినందుకు ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు’’ అని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట సక్సెస్ ‘పెద్ది’ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ పాట సాధించిన రికార్డు వ్యూస్.. ఈ సినిమా ప్యాన్-ఇండియా స్థాయిలో ఎంతటి విజయాన్ని అందుకునే అవకాశం ఉందో స్పష్టం చేస్తోంది. సినిమా విడుదల కాకముందే, పాట ద్వారా ఈ స్థాయి హైప్ క్రియేట్ అవ్వడం ఈ సినిమాకు ఒక గొప్ప ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!
సెకండ్ సాంగ్‌ని అందుకే ఆపారా?
వాస్తవానికి ‘పెద్ది’ సినిమాకు సంబంధించి రెండో పాటను కూడా మేకర్స్ విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఎక్కడ సంక్రాంతికి వచ్చే చిత్రాలపై అటెన్షన్ పోతుందో అని.. సదరు చిత్రాల నిర్మాతలు టీమ్‌ని కోరినట్లుగా తెలుస్తోంది. అందుకే ‘పెద్ది’ రెండో పాటను సంక్రాంతి తర్వాత విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారు. ఇక, ఈ పాట రికార్డు సృష్టించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ అభిమానులను ఉద్దేశించి, ‘మీరు రీల్స్ చేస్తూనే ఉండండి, మీ ప్రేమను కొనసాగించండి’ అంటూ కోరింది. ‘చికిరి చికిరి’ పాట విజయంతో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా 27 మార్చి, 2026న గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

