Former MLC Satyanarayana | తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు సత్యనారాయణ కన్నుమూశారు. 58 ఏళ్ళ ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
సత్యనారాయణ రెండో విడత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు సత్యనారాయణ జర్నలిజంకు స్వస్తి పలికారు. గతంలో మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన… సంగారెడ్డిలో ముందుండి ఉద్యమాన్ని నడిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతకాలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. సత్యనారాయణ మృతి పట్ల జర్నలిస్టులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.