Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్
Pawan and Sujeeth (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!

Pawan Kalyan: ‘ఓజీ’ (OG Movie) దర్శకుడు సుజీత్‌ (Sujeeth)కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఖరీదైన కారును గిఫ్ట్‌గా అందించారు. ఈ విషయాన్ని సుజీత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, తన ఆనందాన్ని పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా ఇందులో గర్జించి, ఆయన అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్ పడటంతో అభిమానులకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించి, రూ. 300కి పైగా కోట్లను రాబట్టి, సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Also Read- Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

‘ఓజీ’ ఊహించని సర్‌ప్రైజ్‌

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ మంచి ఆదరణనే రాబట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ‘ఓజీ’ సీక్వెల్స్ ఉంటాయని, సుజీత్ కోసం చేస్తానని పవన్ కళ్యాణ్ మాట కూడా ఇచ్చారు. ప్రస్తుతం సుజీత్ తన తదుపరి సినిమాను నేచురల్ స్టార్ నానితో చేస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఏమైనా మళ్లీ ‘ఓజీ’ గురించి వార్తలు వస్తాయేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని సర్‌ప్రైజ్‌తో మరోసారి ‘ఓజీ’ని వార్తలలో నిలిపేలా చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాధారణంగా, సినిమా హిట్టయితే హీరో, దర్శకుడు, సంగీత దర్శకులకు నిర్మాత కారు గిఫ్ట్‌గా ఇచ్చే సంప్రదాయం చూస్తూ ఉన్నాం. రజినీకాంత్ ‘జైలర్’ విషయంలో అదే జరిగింది. టాలీవుడ్‌లో కూడా కొందరు నిర్మాతలు అలాగే చేశారు. కానీ, ఒక హీరో, దర్శకుడికి కారు గిఫ్ట్‌గా ఇవ్వడం అంటే.. అతనిపై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

ల్యాండ్ రోవర్ డిపెండర్ గిఫ్ట్‌గా..

స్వతహాగా పవన్ కళ్యాణ్‌కు సుజీత్ వీరాభిమాని. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కల్ట్ ఫ్యాన్‌గా సుజీత్ ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెక్కించి, అభిమానులందరి కోరికను తీర్చారు. పవన్ కళ్యాణ్ కూడా తను దర్శకుడిగా తను కొట్టలేకపోయిన సక్సెస్‌ను సుజీత్‌ సక్సెస్‌లో చూశానని చెప్పడం, అతని నిబద్ధతని కొనియాడుతూ.. మరో ఛాన్స్ ఇస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిపెండర్ (Land Rover Defender) కారుని గిఫ్ట్‌గా ఇచ్చి, సుజీత్‌పై తన ఇష్టాన్ని, ప్రేమను తెలియజేశారు. ఒక అభిమానిగా సుజీత్‌కు ఇంతకంటే ఏం కావాలి. అందుకే ఈ గిఫ్ట్ తన జీవితంలో ఉత్తమమైనదని చెబుతూ ట్వీట్‌లో పేర్కొన్నారు సుజీత్. ‘‘మాటల్లో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. నా ప్రియమైన OG, కళ్యాణ్ గారు నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేనిది. చిన్ననాటి అభిమానిగా మొదలై, ఈ ప్రత్యేక క్షణం వరకు… ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని సుజీత్ తన సంతోషాన్ని తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?