Payal Rajput
ఎంటర్‌టైన్మెంట్

Payal Rajput : పాయల్ ఇక పాన్ ఇండియా ‘వెంకటలచ్చిమి’

స్వేచ్ఛ, సినిమా: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, ‘మం గళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మాట్లాడుతూ.. “మం గళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్ కి నెక్స్ట్ లెవెల్ గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.” అని అన్నారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు