Mass Jathara : మాస్ మహారాజా మీసం మెలేసి హిట్ కొడతారా?
Mass Jathara
ఎంటర్‌టైన్‌మెంట్

Mass Jathara : మాస్ మహారాజా మీసం మెలేసి హిట్ కొడతారా?

స్వేచ్ఛ, సినిమా: మాస్ మహారాజ, రవితేజ (Ravi Teja) గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’, ‘ఈగల్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేకపోయాయి. దీంతో తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా విజయాన్ని సాధించాలనే ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం రవితేజ, భాను బోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర (Mass Jathara)’  సినిమా చేస్తున్నారు. ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : Vishwaksen: అమ్మాయిగా మారిన హీరో, ఎవరంటే..?

‘మాస్ జాతర (Mass Jathara)’ చిత్రం నుంచి అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రాబోతుందని తెలుపుతూ రవితేజ పోస్టర్లని ని వదిలారు. ఒక పోస్టర్లో ఆయన భోజనం చేసేందుకు కూర్చుని కోర మీసం మెలేస్తూ కనిపించారు. మరొక పోస్టర్లో పోలీస్ గెటప్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్స్ మాస్ మహారాజా అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. మీసం మెలేసి మాస్ జాతరతో ఫ్యాన్స్ కి బాక్సాఫీస్ వద్ద ఫుల్ మీల్స్ ఇస్తారా లేదా వేచి చూడాలి.

 

Just In

01

Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?

Mukkoti Ekadashi: మెదక్‌లో వైభవంగా ముక్కోటి.. మంత్రి దంపతుల ప్రత్యేక పూజలు

Chinese Manja: ‘చైనా మాంజా విక్రయాలను అరికట్టాలి’.. సీఐకి డివైఎఫ్ఐ వినతి

Beauty OTT: ‘బ్యూటీ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

Hydraa: దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌.. కబ్జా చెర నుంచి 5 ఎకరాలకు విముక్తి