BRS Greater Hyderabad
తెలంగాణ

గ్రేటర్ పై BRS ఫోకస్.. BJP సపోర్ట్ కోసం ట్రయల్స్?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ పై పట్టుకోసం బీఆర్ఎస్ (BRS) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకోసం కేడర్ ను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమైంది. గ్రేటర్ పై పట్టుసాధిస్తేనే పార్టీకి రాబోయే కాలంలో మనుగడ ఉంటుందని భావించి ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డివిజన్ కార్పొరేట్లతో రెండోసారి భేటీ అవుతున్నారు. పార్టీ మారిన మేయర్ పై అవిశ్వాసం పెట్టి ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లలో విశ్వాసం నింపాలని భావిస్తున్నారు. అవసరం అయితే అవిశ్వాసానికి బీజేపీ మద్దతు సైతం తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ప్రజల మద్దతు ఉంది. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 16 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. అంతేగాకుండా 2020 లో గ్రేటర్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. గ్రేటర్ పై గులాబీ పట్టు నిలుపుకుంది. అయితే ఈ ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగరవేసేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది. 56 డివిజన్లలో బీఆర్ఎస్ విజయ సాధించగా, ప్రస్తుతం 42 మంది పార్టీలో కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. 14మంది కాంగ్రెస్ లో చేరారు. అందులో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కూడా ఉన్నారు.

అయితే మేయర్ పార్టీ మారడంతో పాటు ఆమె తండ్రి కేకే సైతం కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానానికి.. మేయర్ విజయలక్ష్మి పార్టీ మారి భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. అదనుకోసం చూస్తుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో అలర్ట్ అయింది. వారిని కాపాడుకోవాలంటే ఫస్ట్ మేయర్ పై అవిశ్వాస తీర్మానమే మార్గమని భావనకు వచ్చినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం నెగ్గి బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపేందుకు సిద్ధమవుతుంది. ఈ తీర్మానంతో పార్టీలోని కార్పొరేటర్లతో పాటు నేతల్లోనూ విశ్వాసం నింపాలని భావిస్తుంది.

Also Read : Davos : కేసీఆర్, కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు.. కాంగ్రెస్ వినూత్న ప్రచారం

బీజేపీ మద్దతు కోరే అవకాశం?

గత గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఉన్న 150 స్థానాల్లో బీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించింది. 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించాయి. రెండు స్థానాల్లో (ఏఎస్ రావు నగర్, ఉప్పల్) కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ విజయం సాధించిన లింగోజీ గూడెం కార్పొరేటర్ మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీజేపీ 47 స్థానాలకు పరిమితం అయింది. అయితే బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారితో ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 24కి పెరిగింది.  56 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లలో 14మంది కాంగ్రెస్ లో చేరగా, ప్రస్తుతం 42 మంది ఉన్నారు.

మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే 150 కార్పొరేట్లలో 131 మంది మద్దతు తెలిపాల్సి ఉంది. అప్పుడు అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు42 మందితో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్లు 29 మంది ఉన్నారు. దీంతో బీజేపీ మద్దతు కోరాలని, అప్పుడు అవలీలగా మేయర్ పై అవిశ్వాసం నెగ్గొచ్చు అని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. మేయర్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో బీజేపీ సైతం ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భాన్ని వినియోగించుకొని మేయర్ విజయలక్ష్మిని పదవి నుంచి దించి పార్టీ కార్పొరేటర్లలో విశ్వాసం నింపాలని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేయాలని పార్టీ భావిస్తుంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్