Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. ఇక బుకింగ్..!
Special Trains (imagecredit:twitter)
Telangana News, ఆంధ్రప్రదేశ్

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Special Trains: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-అనకాపల్లె (07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో (ఆదివారం), అనకాపల్లె-సికింద్రాబాద్‌ (07042) రైలు జనవరి 5, 12, 19 తేదీల్లో (సోమవారం) నడుపనున్నారు. అలాగే, హైదరాబాద్‌-గోరక్‌పూర్‌ (07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో (శుక్రవారం), గోరక్‌పూర్‌-హైదరాబాద్‌ (07076) రైలు జనవరి 11, 18, 25 తేదీల్లో (ఆదివారం) నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు, ఈనెల 21న మచిలీపట్నం-అజ్మీర్‌ (07274), 28న అజ్మీర్‌-మచిలీపట్నం (07275) మధ్య కూడా ప్రత్యేక రైలును నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

శబరిమల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు 

శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం జనవరి నెలలో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-కొల్లాం మార్గంలో నడిచే 07135/07136 ప్రత్యేక రైళ్లకు కాచిగూడ, కర్నూలు, డోన్‌, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్‌, త్రిచూర్‌, ఎర్నాకుళం వంటి స్టేషన్లలో హాల్ట్‌ సౌకర్యం కల్పించారు. 07135 ప్రత్యేక రైలు జనవరి 14, 21 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు బయల్దేరనుండగా, తిరుగు ప్రయాణంలో 07136 ప్రత్యేక రైలు కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరనుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

Also Read: Akhilesh Yadav: ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు 

విశాఖపట్నం-లింగంపల్లి మార్గంలో నడుస్తున్న జన్మభూమి (12805/12806) ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మార్పులు ఫిబ్రవరి 15 నుంచి (ఇరువైపులా) అమల్లోకి వస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 15 నుంచి ప్రతిరోజూ ఉదయం 6:55 గంటలకు, బేగంపేట 7:20, సికింద్రాబాద్‌ 7:40, చర్లపల్లి నుంచి 8 గంటలకు బయల్దేరనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి ప్రతిరోజూ ఉదయం 6:20 గంటలకు బయల్దేరి, చర్లపల్లికి సాయంత్రం 6:05, సికింద్రాబాద్‌ 6:30, బేగంపేట 6:42, లింగంపల్లికి రాత్రి 7:15 గంటలకు చేరుకోనుంది. ఆయా స్టేషన్లలోనూ మార్పులు ఉంటాయని, ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Also Read: Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..