Vichitra Movie: సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విచిత్ర’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రానికి సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జ్యోతి అపూర్వ ప్రధాన పాత్రలో నటించగా, రవి రావణ్ రుద్ర మరియు శ్రేయ తివారి హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ‘బేబి’ శ్రీ హర్షిణి, మీనావాసు ప్రత్యేక పాత్రల్లో నటించారు. రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Read also-Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘విచిత్ర’ ముఖ్యంగా తల్లి కూతుళ్ల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధం, సెంటిమెంట్‌ను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కింది. కుటుంబ విలువలను, తల్లి ప్రేమ, త్యాగం గురించి ఆలోచించేలా ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నిర్మాత అయిన సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ, “ఒక ఆత్మీయమైన తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ తో రూపొందిన చిత్రం ‘విచిత్ర’. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం గురించి ఆలోచించేలా ఈ సినిమా ఉంటుంది. మా చిత్రాన్ని 2026 కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం,” అని తెలిపారు.
సంగీత దర్శకుడు నిజాని అంజన్ అందించిన పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా, తల్లి సెంటిమెంట్ పై రూపొందిన పాట ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక నిపుణులలో స్టోరీని సిస్ ఫిలిమ్స్ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను కడిమిశెట్టి లక్ష్మీనారాయణ నిర్వహించారు. ధనుంజయ్ రావ్ ఇలపండ కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. కడలి రాంబాబు, దయ్యల అశోక్ పీఆర్ఓలుగా ఉన్నారు. మొత్తం మీద, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో రూపొందిన ‘విచిత్ర’ సినిమా 2026 సంక్రాంతికి ముందు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

