Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?..
mowgli(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Mowgli Controversy: కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్.. సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘మోగ్లీ’. తాజాగా ఈ చిత్రం అనుకున్న రోజు కన్నా ఒక రోజు లేటుగా థియేటర్లలోకి వచ్చింది. బాలయ్య బాబు అఖండ 2 తాండవం సినిమా విడుదల లేట్ అవ్వడం వల్ల మోగ్లీ సినిమా ఇంపేక్ట్ అయింది. దీనికి సంబంధించి ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మోగ్లీ సక్సస్ మీట్లో ‘అఖండ 2 తాండవం’ నిర్మాతలపై తీరుకునే చర్యల గురించి వివరించారు. నిర్మాత ఏం మాట్లాడారు అంటే.. ఇప్పుడు అందురూ రిలీజ్ బిజీలో ఉంటారు. ఇది అయ్యాకా దీనిపై ఆలోచిస్తాం. మాకు ఎంతవరకూ డేమేజ్ అయింది చూసుకుని వారిపై డేమేజ్ సూట్ ఫైల్ చేస్తాము. నేను అంతా రెడీగా పెట్టుకున్నాను. జరిగింది అయితే చిన్న నష్టం కాదు.. దీనికి సంబంధించి మీడియా కూడా మాకు సపోర్టు చేయాలి. రీలీజ్ డేట్ లో మార్పులు రావడం వల్ల మొత్తం ఎకో సిష్టం దెబ్బతింది. చాలా చిన్న సినిమాలు నష్టపోయాయి. అంటూ చెప్పుకొచ్చారు.

Read also-Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

యువ నటుడు రోషన్ కనకాల తన తాజా చిత్రం ‘మోగ్లీ 2025’తో ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుమ మరియు రాజీవ్ కనకాల తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రోషన్, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాపై పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 13, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ఈ సినిమా వసూళ్లు, పంపిణీదారులు నిర్మాతలకు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాయి.ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, ‘మోగ్లీ 2025’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మొదటి రోజు సుమారు రూ.1.0 కోటి నుండి రూ.1.2 కోట్లు (షేర్) వసూలు చేసినట్లు అంచనా. రోషన్ కనకాల కెరీర్‌లో ఇది ఓ మోస్తరు ఆరంభం అని చెప్పవచ్చు. ఈ వసూళ్లు సినిమా మొత్తం బ్రేక్-ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొంత తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.

Read also-DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

విడుదలకు ముందు జరిగిన స్పెషల్ ప్రీమియర్‌లు సినిమాపై హైప్‌ను పెంచాయి. ముఖ్యంగా యాంటీ-హీరో పాత్ర పోషించిన బండి సరోజ్ కుమార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, రెగ్యులర్ షోలు ప్రారంభమయ్యాక సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మొదటి రోజు వచ్చిన వసూళ్లు మిశ్రమ టాక్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఈ వీకెండ్‌లో ‘మౌత్ టాక్’ బలంగా ఉంటేనే సినిమా వసూళ్లు పెరిగి బ్రేక్-ఈవెన్‌ను చేరుకోగలుగుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో సినిమా ప్రదర్శన రోషన్ కెరీర్‌కు కీలకం కానుంది.

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!