Venkatesh Birthday: వెంకటేష్‌కు అనీల్ రావిపూడి గిఫ్ట్ అదిరిందిగా..
venky-mama-hb
ఎంటర్‌టైన్‌మెంట్

Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజుకు అనీల్ రావిపూడి ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది.. మీరూ చూసేయండి..

Venkatesh Birthday: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన గిఫ్ట్ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి బ్లాక్ మాస్టర్ హిట్ సాధించాయి. తాజాగా నాలుగో సినిమా కూడా రెడీగా ఉంది. వెంకీ మామ పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూగి ఎవరూ ఊహించలేని గిఫ్ట్ ఇచ్చారు. వెంకీ మామపై ఉన్న అభిమానాన్ని తను ఇలా చూపించుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు గిఫ్ట్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకూ ఏం చేశారు అంటే.. కొంత మంది గ్రూప్ సభ్యులతో కలిసి వెంకీ మామకు చాలా ఇష్టమైన డైలాగ్ అయిన ‘ఎనీ టైమ్.. ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ గణేష్ హ్యాపీ బర్తడే వెంకటేష్ గారూ..’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు సూపర్ గా చెప్పారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-Sreeleela: టాలీవుడ్ వద్దనుకుంటోంది.. బాలీవుడ్ మాత్రం బంపరాఫర్స్ ఇస్తోంది

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేసిన ‘విక్టరీ’ వెంకటేష్ నేడు 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 35 సంవత్సరాల కెరీర్‌లో, ఆయన కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు, కామెడీ, భక్తి రస చిత్రాలలో తన బహుముఖ నటనతో ప్రేక్షకులను అలరించారు. ‘కలియుగ పాండవులు’, ‘స్వర్ణకమలం’, ‘క్షణ క్షణం’, ‘చంటి’, ‘రాజా’, ‘లక్ష్మి’, ‘దృశ్యం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన పాత్రల ఎంపికలో చూపిన వైవిధ్యం, ప్రేక్షకులతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధానికి నిదర్శనం. యువ నటులతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉండటం ఆయన గొప్పతనం. తమిళం, హిందీ చిత్రాల రీమేక్‌లలోనూ విజయం సాధించి, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఆయన, తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు.

Read also-RajaSaab Second Single: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సెకండ్ సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్.. వచ్చేది ఎప్పుడంటే?

వెంకటేష్, అనిల్ రావిపూడి కలయిక తెలుగు సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయే నవ్వుల విందు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (2019). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, పెళ్లయిన భార్యాభర్తల మధ్య ఉండే సరదా గొడవలు, ఫ్రస్ట్రేషన్‌ను హాస్యం జోడించి చూపించింది. ఇందులో వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ టేకింగ్ కలిసి సినిమాను పెద్ద హిట్‌గా నిలబెట్టాయి. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అఖండ విజయం సాధించడంతో, ఈ కాంబోలో మళ్లీ ‘F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (2022) వచ్చింది. ‘F2’లో భార్యల వల్ల ఫ్రస్ట్రేషన్ పడిన హీరోలు, ‘F3’లో డబ్బు చుట్టూ తిరిగే సమస్యలను ఎదుర్కొంటూ ప్రేక్షకులను మళ్లీ కడుపుబ్బా నవ్వించారు. ‘F2’, ‘F3’ విజయాల తరువాత, వెంకటేష్, అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్ లో వీరి మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా బ్లాక్ బాస్టర్ అయింది. ప్రస్తుతం వెంకీ మామ మెగాస్టార్ తో కలిసి ‘మనశంకరవరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తున్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క