Madhavi Interview: మిర్చి మాధవి, తెలుగు సినిమా మరియు టెలివిజన్ రంగంలో సుపరిచితురాలైన నటి. ఆమె ప్రధానంగా హాస్య పాత్రలు మరియు సహాయక పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటిగా, హాస్యనటిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె కెరీర్ ప్రారంభంలో టీవీ రంగంలో అడుగుపెట్టి, అనేక ధారావాహికలు, కామెడీ షోలలో నటించారు. తర్వాత, ఆమె సినిమాల్లోకి ప్రవేశించి, తనదైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా, ఆమె డైలాగ్ డెలివరీ, తెలంగాణ యాసలో మాట్లాడే విధానం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తన పాత్రకు సరళతను, సహజత్వాన్ని జోడించి, తెరపై కనిపించే ప్రతిసారీ నవ్వులు పూయించడం ఆమె ప్రత్యేకత. తాజాగా ఆమె ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సీరియల్స్ లో జరిగే కొన్ని ఘటనల గురించి ఆమె నోరు విప్పారు. అసలు కొందరు నటులు అయితే ఒక సినిమా చేయగానే వారు చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నారు అని అని ఛత్రపతి శేఖర్ చెప్పారు. ఆ కామెంట్లు గురించి మీరు ఏం అంటారు అని యాంకర్ అడగ్గా.. ఆమె దాని గురించి మాట్లాడలనుకోవడం లేదు అయినా వారు చెప్పారు కాబట్టి చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Ram Setbacks: రామ్ పోతినేని ‘ఆంధ్రకింగ్ తాలూకా’ క్లోజింగ్ రిపోర్ట్.. ఆ రికార్డుల్లోకి మరో సినిమా..
టీవీ సీరియల్ విషయంలో.. కొంత మంది నటులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారిని దర్శకుడు కూడా భరించలేకపోతున్నారు.. అంటూ అనడంతో అంత భరించలేనప్పుడు వారిని భరించడం ఎందుకు, తీసేయ్యవచ్చు కదా.. అది వాళ్ల విచక్షణ ఎందుకు తీయడంలేదు అంటే అది వాళ్లు కంఫర్ట్ గా ఉన్నారనేకదా.. మీరు చాలా రిచ్ అంట కధా? ఎక్కడికి వెళ్లాలన్నా.. విమానంలో వెళ్తుంటారు అంట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రిచ్ అని కాదు బాగానే సంపాదించాను. ఎక్కడికి వెళ్లాలి అన్నా నా సౌలభ్యం చూసుకుంటా అందుకే విమానం లో వేళతా ఓ సారి మా అబ్బాయి నన్ను విమానం ఎక్కించు అని గోల చేస్తుంటే.. మా అక్కగారింటికి వైజాగ్ తీసుకెళ్లాను. ఇవన్నీ నా సౌలభ్యం కోసమే చేస్తుంటాను అంటూ చెప్పుకొచ్చారు. డ్రస్ విషయంలో, మర్యాద విషయంలో నాకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను ఏది ఏమైనా నాకు కంఫర్ట్ చాలా అవసరం. అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. సందీప్ రెడ్డి వంగా గురించి కూడా చెప్పుకొచ్చారు.. సందీప్ రెడ్డి వంగా, మాధవి కలిసి ఓ సందర్భంలో కలిసి పనిచేశారని అందుకే ఇద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. మిర్చి మాధవికి ఇగో ఎక్కువ ఎవరినీ కలవరు.. అంటుంటారు.. దీనిపై ఆమె స్పందిస్తూ.. నాకు అలాంటిది ఏమీ లేదు నేను అందరినీ అవకాశాలు అడుగుతాను.. అంటూ చెప్పారు.
Read also-Saroj Comments: ‘అఖండ 2’ సినిమా గురించి బండి సరోజ్ ఏం అన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

